మనదేశంలో  ఆధ్యాత్మిక భావనలు ఎక్కువగా ఉంటాయి.  ప్రకృతితో ఏదైనా చిన్న విషయం జరిగినా  భయపడిపోతాం.  దేవుడికి కోపం వచ్చిందని రకరకాల శాంతులు చేస్తుంటారు.  శివుడికి కోపం వస్తే మూడో కన్ను తీరుస్తారని.. ప్రళయం వస్తుందని చెప్తుంటారు.  ఈ  ప్రళయం మాట అటుంచితే.. ఇప్పుడు మహారాష్ట్రలో అలాంటి ప్రళయమే వచ్చేలా ఉన్నది.  


మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా వర్షాలు ఆగకుండా కురుస్తున్నాయి.  దీంతో చిన్న చిన్న కాలువల నుంచి పెద్ద పెద్ద నదుల వరకు ఉప్పొంగి పొంగుతున్నాయి.  అంతేకాదు, జ్యోతిర్లింగాల్లో ఒకటిగా చెప్పబడిన త్రయంబకేశ్వరం శివలింగం పానమట్టం నుంచి నీరు ఉబికి వస్తోంది. అది కొద్దికొద్దిగా వస్తే పర్వాలేదు.


ఆ నీటి వలన ఆ  గుడి బయట ఉన్న  దుకాణాలు మునిగిపోయే పరిస్థితి వచ్చింది.  దీంతో పాపం అక్కడి దుకాణదారులు ఇబ్బదులు పడుతున్నారు.  ఏం జరుగుతున్నదో అర్ధంకాని పరిస్థితి.  వారి జీవనోపాధి దెబ్బతినడంతో లబోదిబో అంటున్నారు.  శివుని దగ్గర పనిచేసుకుంటూ బ్రతుకుతున్న తమకు ఇలాంటి పరిస్థితి రావడం ఇదే మొదటిసారి అని అంటున్నారు.  


 శివలింగం పానమట్టం నుంచి నీరు ఆ విధంగా ఉబికిరావడానికి కారణం ఏంటి .. ఎందుకు ఆ స్థాయిలో నీరు పొంగి వస్తోంది.  శివయ్యకు నిజంగానే కోపం వచ్చిందా..  దానికి సమాధానం కొరికింది.  అదేమంటే.. త్రయంబకేశ్వరానికి దగ్గరలో బ్రహ్మగిరి ప్రాంతంలో గోదావరి నది పుట్టుక ఉంది. 

ఆ నది నుంచి ఒక పాయ త్రయంబకేశ్వరం నుంచి అంతర్వాహినిగా వెళుతుంది.  దీంతో పానమట్టం నుంచి నీరు పైకి వస్తుంది.  ఆ నీటినే ప్రసాదంగా భక్తులకు ఇస్తారు.  కానీ, ఈస్థాయిలో ఇలా నీరు ఉకిబిరావడం ఇదే మొదటిసారి అని అక్కడి ఆలయ నిర్వాహకులు చెప్తున్నారు. ఇలానే ఇంకొన్నాళ్ళు  జరిగితే అక్కడి పరిస్థితులు దారుణంగా  మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: