మనం నివశిస్తున్న భూమి ఎలా ఉండేది అనే ప్రశ్నకు బల్లపరుపుగా ఉంటుంది అనే సమాధానం చెప్పేవారు.  కానీ, గ్రీక్ ఫిలాసఫర్ ప్లూటో తన పరిశోధనల ద్వారా భూమి బల్లపరుపుగా ఉండదని.. గుండ్రంగా ఉంటుందని పేర్కొన్నారు.  ఆ తరువాత ఆయన చెప్పిన ప్రతిపాదనను అనేక మంది శాస్త్రవేత్తలు కూడా నిరూపించారు.  ఈ విషయాన్నీ కాస్త పక్కన పెట్టి.. అసలు విషయానికి వద్దాం. 


జైనమతం.. మహావీరుడు స్థాపించిన మతం. కఠినమైన నియమాలు పాటించే మతాల్లో ఇదొకటి. బౌద్ధమతం నుంచి విడిపోయిన మాహావీరుడు జైనమతాన్ని స్థాపించాడు.ఈ విషయం కూడా పక్కన పెడదాం.  జైనమతంలో భూమి యొక్క ఆకారం గురించిన కొన్ని విషయాలు పేర్కొనబడ్డాయి.  భూమి ఎలా ఉంటుంది అనే విషయం గురించిన వాదనే ఇది.  


భూమి బల్లపరుపుగా ఉందని గుండ్రంగా లేదని జైనమతంలో పేర్కొన్నట్టు తెలుస్తోంది.  బంగారు వర్ణంలో ఉండే మేరు పర్వతం చుట్టూ ఈ విశ్వపరిభ్రమణం జరుగుతున్నట్టు అందులో పేర్కొన్నారని కొందరి వాదన.  అయితే, జైనం అన్నది మతానికి సంబంధించిన అంశం.  అందులో శాస్త్రీయమైన వాదన ఉందా.. ఉంటె ఎంతవరకు బలంగా ఉంది అని తెలుసుకోవాలి.  ఎందుకంటే ఇప్పటికే సైన్స్ భూమి ఆకారం గురించిన విషయాలను శాస్త్రీయంగా నిరూపణ కూడా చేసింది. 


టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక భూమి మీదనే కాకుండా, మనిషి చంద్రునిపై కూడా అడుగుపెట్టాడు. అక్కడ పరిశోధన సాగిస్తూ... మనిషి ఆవాసయోగ్యమా కాదా అన్నది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.  మార్స్ మీదకు కూడా ఉపగ్రహాలను పంపి ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే.   ఒక్క మార్స్ లోనే కాకుండా అనేక గ్రహాలపై కూడా పరిశోధనలు సాగిస్తున్నారు.  ఈ ప్రయోగాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: