తమిళనాడు అనగానే మనకు దేవాలయాలు గుర్తుకు వస్తాయి.  తమిళనాడులో ఉన్నన్ని దేవాలయాలు దేశంలో మరెక్కడా కనిపించవు.  పెద్ద పెద్ద గోపురాలతో కూడిన దేవాలయాలు 
అక్కడ మనకు కనిపిస్తాయి.  ఒక్కొక్క దేవాలయాలని ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.  వందలాది సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయాలు ఇప్పటికీ కొన్ని చెక్క చెదరకుండా ఉన్నాయి 
అంటే అర్ధం చేసుకోవచ్చు.  వాటి ప్రత్యేకత ఏమిటో.  
 
 
ఇక ఇదిలా ఉంటే, భారతదేశాన్ని మంది రాజులు పరిపాలన సాగించారు.  ఆ రాజుల్లో అల్లావుద్దీన్ ఖిల్జీ ఒకరు.  ఈయన మహా క్రూరుడు.  దాడులు చేసి రాజ్యాలను 
ఆక్రమించుకోవడమే ఖిల్జీ ధ్యేయంగా పెట్టుకున్నారు.  భారతదేశంలోని అనేక ప్రాంతాలను ఆక్రమించుకొని అందినమేరకు దోచుకున్నాడు.  ఇక ఆయన సేనలు చేసే 
క్రూరత్వం గురించి ప్రత్యేకించి చెప్పక్కరలేదు.  
 
ఇక ఇదిలా ఉంటే, 12 వ శతాబ్దంలో తమిళనాడులోని మధురై ప్రాంతాన్ని పాండ్యన్ రాజులు పరిపాలన చేసేవారు.  కులశేఖర పాండ్యన్ అందులో ముఖ్యుడు.  
ఈయన ఏలుబడిలో మధురై ప్రాంతంలో అనేక దేవాలయాలను నిర్మించాడు.  ఈయనకు ఇద్దరు పిల్లలు.  ఒకరు జఠావర్మ సుందర పాండ్యన్, వీర పాండ్యన్.  
వీరు ఇద్దరు గొప్ప ధైర్యవంతులు.  వీరిలో పెద్దవాడైన సుందర పాండ్యన్ కు  కళలపై మక్కువ ఎక్కువ.  మధురై నగరాన్ని సుందరంగా తీర్చి దిద్దడంలో 
సుందర పాండ్యన్ ప్రముఖ పాత్ర పోషించాడు.  అంతేకాదు, ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్న మధుర మీనాక్షీ దేవాలయాన్ని ఆయన కాలంలోనే మెరుగులు దిద్దుకున్నాయి.  
ఇదంతా 1295 వ సంవత్సరం ప్రాంతంలో జరిగింది.  మధురై దేవాలయానికి అనేక మంది అనేక రకాల బంగారు ఆభరణాలను కానుకలుగా ఇచ్చారు.  
 
కులశేఖర పాండ్యన్ కు వయసు పెరగడంతో తన కొడుకు ఇద్దరిలో ఎవరికి రాజ్యాన్ని అప్పగించాలి అనే చింతనలో ఉండగా.. ఉత్తర భారతాన్ని గడగడలాడిస్తున్న 
అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశంలోని రామేశ్వరం దేవాలయంపై దాడిచేసి సంపదను దోచుకొని వెళ్లారు.  కాగా కులశేఖర పాండ్యన్ సడెన్ గా అనారోగ్యం పాలై మరణించాడు.  
దీంతో అన్నదమ్ముల ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి.  కాగా, సుందర రాజ పాండ్యన్ అల్లా వుద్దీన్ ఖిల్జీ తో చేతులు కలిపి రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని చూశాడు.  
ఈ సమయంలో అల్లావుద్దీన్ సేనలు మధురై లోని మీనాక్షి దేవాలయాన్ని కొంతమేర దోచుకున్నారు.  
 
అయితే, సుందర రాజన్ అనుకున్నది ఒకటి అక్కడ జరిగింది ఒకటి.  ఎంతో ప్రీతికరమైన దేవాలయాన్ని ఆ మూకలు దోచుకోవడంతో బాధపడిపోయాడు.  అల్లా వుద్దీన్ ఖిల్జీ కి 
మధురై దేవాలయంలో ఇంకా సంపద ఉందని, ఎలాగైనా దోచుకోవాలని అనుకున్నాడు.  ఖిల్జీ సేనలు మీనాక్షీ దేవాలయంవైపు వస్తున్నాయని తెలుసుకున్న సుందర రాజన్ భయపడిపోయాడు.  
దేవాలయాన్ని ఎలాగైనా కాపాడమని ఆ గుడిలో ఉన్న ఓ సాధువును బ్రతిమిలాడడు.  
 
ఆ సాధువు నవ్వుతూ.. భయం అక్కరలేదు.. కొన్ని ఏనుగు రాతి విగ్రహాలను, చెరుకు గడలను తనకు ఇవ్వమని చెప్పాడు.  సాధువు చెప్పినట్టుగానే ఏనుగు విగ్రహాలను ఏర్పాటు చేసి.. 
కావలసినంత చెరుకు గడలను పంపించాడు సుందర పాండ్యన్.  
 
ఇక ఖిల్జీ సేనలు దేవాలయంలోకి అడుగు పెట్టాయి.  అక్కడే ఉన్న సాధువు చెరుకు గడలను రాతి ఏనుగులకు పెడుతున్నాడు.  ఆ రాతి ఏనుగులు గడలను తింటున్నాయి.  
ఆ సంఘటనను చూసి సేనలు షాక్ అయ్యారు.  ఆ విషయం గురించి అక్కడ ఉన్న సాధువును అడగగా.. ఆ దేవాలయంలో సాక్షాత్తు శివుడు ఉన్నాడని 
ఈ ఏనుగులు ఆయనకు చెందినవే అని.. చెప్పడంతో వారు ఆశ్చర్యపోయారు.  భీకర ఆకృతిలో ఉన్న ఆ రాతి ఏనుగులను చూసి షాకైనా సేనలు వెనక్కి వెళ్ళిపోయి 
జరిగిన విషయాన్ని ఖిల్జీ చెవిలో పడేశారు.  

 


మరింత సమాచారం తెలుసుకోండి: