డిపెండింగ్ ఛాంపియన్ హోదా లో  ఇంగ్లాండ్ లో జరగనున్న ప్రపంచ కప్ బరి లోకి దిగనున్న కోహ్లీ సేన పై అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి. మరోసారి భారత్ జట్టు విశ్వ విజేత గా నిలువాలని అభిమానులు కోరుకుంటున్నారు.

అభిమానులు కోరుకుంటున్నట్లుగా  ఇంగ్లాండ్ లో కోహ్లీ సేన ఛాంపియన్ గా ఆవిర్భవించడం అంత ఆషామాషీ వ్యవహారమేమి కాదు. విదేశీ పిచ్ లపై భారత్ బ్యాట్స్ మెన్లు తడబడిన సంఘనలే అనేకం. అందులో ఇంగ్లాండ్ లోని బౌన్సీ, ఇరువైపులా బంతి  స్వింగ్  అయ్యే పిచ్ లపై భారత్ బ్యాట్స్ మెన్లు ఎంత వరకు నిలకడగా రాణించి ప్రత్యర్థి ముందు భారీ స్కోర్లు నిర్దేశిస్తారనేది అనుమానమే.

భారత ఉపఖండం లోని బ్యాట్స్ మెన్ పెండ్లి పిచ్ లపై  జరిగిన గత వరల్డ్ కప్ లో భారత్ జట్టు అద్భుతంగా రాణించి విజేత గా నిలిచింది. బ్యాట్స్ మెన్ ప్రెండ్లి పిచ్ లపై భారత బ్యాట్స్ మెన్లు చెలరేగి పోవడం, విదేశీ పిచ్ లపై చతికిల పడడం సర్వసాధారణమే కావడం తో , ఇంగ్లాండ్ గడ్డ పై జరగనున్న ప్రపంచ కప్ లో భారత్ జట్టు ఏ మేరకు రాణిస్తున్నది ప్రశ్నార్ధకంగా మారింది. భారత బ్యాటింగ్ లైనప్ చక్కగానే ఉన్నప్పటికీ, నాల్గవ నెంబర్ లో ఎవరు బ్యాటింగ్ చేస్తారన్న దానిపై ఇప్పటికి  స్పష్టత కొరవడింది.

ఇక బ్యాటింగ్ భారమంతా కెప్టెన్ కోహ్లీ పైనే అధికంగా ఉండడం కలవర పర్చే విషయమని చెప్పాలి. ఓపెనర్లు రోహిత్, శిఖర్ లు రాణిస్తే కోహ్లీ పై ఒత్తిడి తగ్గే అవకాశాలు ఉన్నాయి. మిడిల్ ఆర్డర్ లో కేదార్ జాదవ్, ధోని కీలకం కానున్నారు. బౌలింగ్ లో బుమ్రా, భువి, షమీ లతో పాటు స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ లు రాణిస్తే భారత్ అభిమానుల కోరిక నెరవేర్చే అవకాశాలు ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: