హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, లిమిటెడ్ ఓవర్స్ లో టీమిండియా వైస్ కెప్టెన్. వన్డేల్లో, టి20ల్లో ఓపెనర్. ఈ వరల్డ్ కప్ అత్యధికంగా ఎవరికీ సాధ్యం కాని రీతిలో 5 శతకాలు సాధించి ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు. కెరీర్ మొత్తం 27 వన్డే సెంచరీలు బాదిన రోహిత్ శర్మ.. క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీకు సమంగా కొనసాగుతున్నాడు.


అయితే ఒకే ఒక్క లోటు రోహిత్ శర్మను వెంటాడుతోంది. అదే టెస్ట్ క్రికెట్. నిజానికి రోహిత్ శర్మ కు ఫేవరెట్ ఫార్మాట్ టెస్ట్ క్రికెట్. ఐతే దురదృష్టమో లేక ఇచ్చిన ఛాన్స్ లు సరిగ్గా నిలుపుకోలేకపోవడమో కానీ ఇప్పటికీ టెస్ట్ క్రికెట్ లో రోహిత్ శర్మ స్థానం పదిలం కాలేదు. నిజానికి రానున్న వెస్టిండీస్ టూర్ లో మనోడు టెస్ట్ మ్యాచెస్ కు జట్టులో ఉంటాడో లేదో కూడా క్లారిటీ లేదు.
మోడరన్ వన్డే క్రికెట్ లో బెస్ట్ క్రికెటర్ అని పేరున్న రోహిత్ శర్మ, టెంపర్మెంట్ కు మారుపేరైన రోహిత్ శర్మ, టెక్నీక్ విషయంలో బెస్ట్ అని పేరు పొందిన రోహిత్ శర్మ దశాబ్ద కాలం గడిచినా కూడా టెస్టుల్లో తడబడుతుండడం ఆశ్చర్యకరమే. ఇప్పటివరకూ కేవలం 47 ఇన్నింగ్స్ లు ఆడిన రోహిత్ శర్మ 39 సగటుతో 1585 పరుగుల స్కోర్ చేసాడు.


రోహిత్ శర్మ స్టాండర్డ్స్ కు ఇది చాలా సాధారణమైన స్కోర్. రోహిత్ శర్మ ఇప్పటివరకూ 3 టెస్ట్ సెంచరీలు చేసాడు. ఈ మూడూ కూడా ఇండియన్ గడ్డపై సాధించినవే. టీమ్స్ కూడా వెస్టిండీస్, శ్రీలంక వంటి వీక్ టీమ్స్ పై. ఓవర్సీస్ లో అయితే రోహిత్ శర్మ రికార్డ్ మరీ పేలవం. కేవలం 26 సగటుతో 816 పరుగులు చేసాడు.


అయితే ఇదంతా గతం. ప్రస్తుతం రోహిత్ శర్మ భీభత్సమైన ఫామ్ లో ఉన్నాడు. గత ఆస్ట్రేలియా సిరీస్ లో, తర్వాత వరల్డ్ కప్ లో రికార్డుల మీద రికార్డులను తన ఖాతాలో
వేసుకుంటున్నాడు. ఇక విరాట్ కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ అనే స్టేజ్ నుండి విరాట్ కోహ్లీ సరసన రోహిత్ శర్మ అనే స్థాయికి వచ్చేసాడు.టెక్నీక్ పరంగా ఇప్పుడు పీక్స్ లో ఉన్నాడు. సక్సెస్ఫుల్ బ్యాట్స్ మెన్ కు ఉండే లక్షణాలన్నీ ఇప్పుడు రోహిత్ శర్మకు పుష్కలంగా ఉన్నాయి. పైగా మైండ్ సెట్ పరంగా సరైన స్పేస్ లో ఉన్నాడు. సో, రోహిత్ శర్మ ఫెయిల్ అవుతాడు అని చెప్పడానికి రీజన్స్ లేవు. మరి వెస్టిండీస్ తో సిరీస్ లోనైనా రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ సెట్ అయి తన టాలెంట్ కు న్యాయం చేస్తాడేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: