పాకిస్థాన్ ప్రముఖ క్రికెటర్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ చాలా మంది మహిళల్లో ప్రేమ పేరుతో వచ్చి వంచించినట్టు సంచలన ఆరోపణలు వెలుగు చూస్తున్నాయి.తన క్రికెట్ స్టార్ డమ్ ను ఉపయోగించి అనేక మంది యువతుల్ని ఇమామ్ ఉల్ హక్ మోసం చేశాడనే పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.


పలువురు యువతులతో అతను చాటింగ్ చేసిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.చాలా మంది మహిళలను ప్రేమ పేరుతో చెప్పి లోబరచుకుని వారితో శారీరక సంబంధాలు కూడా పెట్టుకున్నాడని తెలుస్తోంది. 


గత ఆరు నెలల కాలంలోనే ఇమామ్ చాలా మంది యువతులతో సంబంధాలు పెట్టుకున్నాడని ప్రపంచకప్ సమయంలోనూ కొనసాగించాడని పాక్ మీడియా పేర్కొంది అయితే ఇమామ్ పై ఎవరో చట్ట పరంగా కేసు లు పెట్టలేదు కాగా తీవ్ర ఆరోపణలు వస్తున్నప్పటికీ ఇటు ఇమామ్ గానీ అటు పాక్ బోర్డు గానీ ఈ వివాదం పై ఇప్పటి వరకూ స్పందించలేదు.ఇలా స్పందించక పోవటంపై ఆరోపణలూ నిజమా కాదా అని ప్రజల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది 


మరింత సమాచారం తెలుసుకోండి: