2019 వరల్డ్ కప్ సిరీస్ క్రికెట్ ప్రియులకు చేదు అనుభవాలను మిగిల్చింది, ఐసీసీ బోర్డ్ నివ్వహించిన షెడ్యూల్ లో జరిగిన పొరపాట్లు అన్ని ఇన్ని కావు, కేవలం వర్షం కారణంగా ఎన్నో మ్యాచ్ లు రద్దయ్యాయి అంతెందుకు ఇండియా సెమీస్ లో ఓడిపోవడానికి కారణం అర్థతరంగా పడిన వర్షమే.


అయితే కేవలం తప్పు వర్షానిదే కాదు వరల్డ్ కప్ సిరీస్ కు ఎంపైర్లు గా వ్యవహరించిన వాళ్ళు కూడా ఎన్నో తప్పులు చేశారు. ఫైనల్ లో న్యూజిలాండ్ కు ఇంగ్లాండ్ కు జరిగిన మ్యాచ్ లో బ్యాట్ కు తగిలి బంతి బౌండరికి వెళ్ళినప్పుడు అంపైర్ 6 పరుగులు ఇచ్చి ఇంగ్లాండ్ గెలవడానికి సహాయం చేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వివాదం పై స్పందించిన అంపైర్ కుమార్ ధర్మసేన కూడా తాను 6 పరుగులు ఇచ్చి తప్పు చేశానని లేకుంటే న్యూజిలాండ్ విజేతలుగా నిలిచేవారని అన్నాడు.


ఇంగ్లాండ్ వరల్డ్ కప్ లో బాగానే ఆడి ఉండొచ్చు కానీ ఇంగ్లాండ్ టీమ్ కు మాత్రం విశ్వవిజేతలుగా నిలిచే సత్తా లేదు అంటున్నారు క్రికెట్ అభిమానులు.ప్రస్తుతం జరిగిన టెస్ట్ సిరీస్ లో పసికూన టీమ్ అయిన ఐర్లాండ్ చేతిలో ఇంగ్లాండ్ టీమ్ 85 పరుగులకే అల్ ఔట్ అయ్యారు. కేవలం ఐసీసీ వేసిన చెత్త షెడ్యూల్ వల్లే ఇంగ్లాండ్ ప్రపంచ కప్ సొంతం చేసుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: