బాల్  ట్యాంపరింగ్‌  కారణంగా  ఆస్ట్రేలియా ఆటగాళ్లు  డేవిడ్ వార్నర్ , స్టీవెన్ స్మిత్ , బ్యాన్ క్రాఫ్ట్ లు నిషేధం  ఎదుర్కున్నాక యాషెస్ సిరీస్ రూపంలో మొదటి టెస్ట్ సిరీస్ కు ఎంపికయ్యారు.  అయితే  గురువారం యాషెస్ టెస్ట్ సీరిస్ ప్రారంభం కాగా  మొదటి మ్యాచ్ మొదటి రోజు ఈ ముగ్గురి ఆటగాళ్లను  బాల్  ట్యాంపరింగ్‌   నాటి చేదు జ్ణాపకాలు  వెంటాడాయి.  ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ కు ముందు ఆస్ట్రేలియా ఆటగాళ్లు జాతీయ గీతం ఆలపిస్తుండగా ఇంగ్లాండ్ అభిమానులు  'సాండ్ పేపర్లు'  చూపిస్తూ ఆసీస్ ఆటగాళ్లను హేళన చేశారు. 


ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా 2 పరుగులే చేసి వార్నర్ అవుట్ అయ్యాడు.   అయితే  వార్నర్  పెవీలియన్ చేరే క్రమంలో  స్టాండ్స్ లో వున్న ఇంగ్లాండ్ అభిమానులు గట్టిగా అరుస్తూ  సాండ్ పేపర్లను చూపిస్తూ మరోసారి హేళన చేశారు. మరో ఓపెనర్ బ్యాన్ క్రాఫ్ట్ అవుట్ అయ్యాక  కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యింది. ఇక స్మిత్ బ్యాటింగ్ వస్తున్న సమయంలో స్టాండ్స్ లో ఉన్న ముగ్గురు  ఇంగ్లాండ్ అభిమానులు  స్మిత్  ఏడుపు ముఖం తో ఉన్నటువంటి  మాస్క్ లను ధరించి  హంగామా చేశారు.  అయితే ఈ మ్యాచ్ తొలి రోజే  అద్భుతమైన సెంచరీ చేసి  వారి ఫై రివేంజ్ తీర్చుకున్నాడు స్మిత్. 


 కాగా  ఇటీవల జరిగిన ప్రపంచ కప్ లో కూడా వార్నర్ , స్మిత్ లకు  ఇలాంటి అవమానాలే ఎదురయ్యాయి. అయితే  ఆ టోర్నీ లో అద్భుతంగా రాణించి బ్యాట్ తో  ఇద్దరు బ్యాట్ తో సమాధానం చెప్పారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: