తన ఆటతో భారతదేశాన్ని శిఖరాగ్రాలకు తీసుకెళ్ళిన తెలుగు తేజం ఏస్ షట్లర్ పీవీ సింధు మరో అరుదైన ఘనత సాధించింది. ఆటతోపాటు ఆర్జనలోనూ దూసుకెళ్తున్న ఈ తెలుగమ్మాయి ఫోర్స్ 2019 మహిళా అథ్లెట్ల జాబితాలో భారత్ నుంచి అగ్ర స్థానంలో నిలిచింది. ఓవరాల్ గా పదమూడవ స్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఓ ఏడాదిలో అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న తొలి పదిహేను మంది మహిళా అథ్లెట్ల జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ బుధవారం ప్రకటించింది


.ఆ జాబితా ప్రకారం సింధు ఏడాదికి అక్షరాలా ముప్పై తొమ్మిది కోట్ల పారితోషికం అందుకుంటోంది. సింధు మినహా భారత్ నుంచి మరే క్రీడాకారిణికీ ఫోర్బ్స్ జాబితాలో చోటు లభించలేదు. ఓవరాల్ గా టెన్నిస్ స్టార్ సెలీనా విలియమ్స్ రెండు వందల ఏడు కోట్లతో అత్యధికంగా ఆర్జిస్తున్న మహిళా అథ్లెట్ లలో అగ్ర స్థానంలో నిలిచింది. జపాన్ టెన్నిస్ కెరటం నవోమి ఒసాకా రెండో స్థానంలో నిలవగా, జర్మనీ టెన్నిస్ తార ఎంజలీన కెర్బర్ కు మూడో స్థానం దక్కింది.



సింధు ఇప్పటికీ భారత్ లో అత్యధిక మార్కెట్ కలిగిన మహిళా అథ్లెట్ గత సీజన్ చివర్లో ఆమె వరల్డ్ టూర్ ఫైనల్స్ తో ఈ టైటిల్ గెలిచిన తొలి భారత షట్లర్ గా రికార్డు సృష్టించింది అని ఫోర్బ్స్ తెలిపింది. గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు సదరు అథ్లెట్ల టోర్నీ ప్రైజ్ మనీ ఎండార్స్ మెంట్ ల ద్వారా లభించిన మొత్తం ఆదాయం ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్టు ఫోర్బ్స్ ప్రకటించింది.



ఏడాదిలో సింధుకు టోర్నీల ప్రైజ్ మనీ ద్వారా లభించిన మొత్తం కంటే ఎండార్స్ మెంట్ ల రూపంలో వచ్చిందే ఎక్కువ కావడం విశేషం. ప్రైజ్ మనీ కింద 3.50 కోట్లు అందుకున్న సింధు ఎండార్స్ మెంట్ ల నుంచి ఏకంగా 35.50 కోట్లు ఆర్జించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: