నిన్నటి వరకు  టీంఇండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్  ఫై  విమర్శకులు కొనసాగగా ఇప్పుడు ఓపెనర్ రాహుల్ వంతు వచ్చింది. పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఆకట్టుకుంటున్న రాహుల్ టెస్టుల్లో మాత్రం తేలిపోతున్నాడు. అతను గత 12 ఇన్నింగ్స్ ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు .  ఇటీవల వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ లో కూడా అదే ఫామ్ ను కొనసాగించడం తో రాహుల్ ఫై విమర్శలు వస్తున్నాయి. 






అందులో భాగంగా  భారత మాజీ సారథి  గంగూలీ ,రాహుల్  ఫై మండిపడ్డాడు.  ఎన్ని అవకాశాలు ఇచ్చిన సద్వినియోగం చేసుకోవడం లేదు ..  రాహుల్ కు అవకాశాలు ఇచ్చింది చాలు  టెస్టుల్లో ఓపెనర్ గా  రోహిత్ శర్మ ను ప్రయత్నిచండి అని గంగూలీ , మేనేజ్ మెంట్ కు  సూచించాడు.  విండీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్  లో అందరు ఫామ్ లోకి వచ్చారు.. ఒక్క రాహుల్ తప్ప.   టెస్ట్ ల్లో కూడా రోహిత్ నే ఓపెనర్ గా పంపించండని అని ఇంతకుముందే చెప్పాను.  అతను అద్భుతమైన బ్యాట్స్ మెన్.  ప్రపంచ కప్ లో అద్భుతంగా రాణించిన కూడా రోహిత్ కు తుది జట్టులో చోటు దక్కపోవడం నిరాశపరిచింది. ఐదు ,ఆరు స్థానాల్లో  రహానే , విహారి  అదరగొడుతున్నారు. దాంతో రోహిత్ ను రాబోయే టెస్ట్ సిరీస్ లలో ఓపెనర్ గా పంపించాలని గంగూలీ పేర్కొన్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: