ఇటీవల టెస్టుల్లో నంబర్‌ వన్‌ ర్యాంకును దక్కించుకుని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి రికార్డు కొద్ది రోజుల‌కే బ్రేక్ అయ్యింది. కోహ్లీని వెన‌క్కు నెట్టేసిన ఆసీస్ క్రికెట‌ర్ స్టీవ్ స్మిత్ మ‌రో అరుదైన ఘ‌న‌త సాధించారు. ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న యాషెన్ సీరిస్‌లో ఆసీస్ ఆట‌గాడు స్టీవెన్ స్మిత్ ప‌రుగుల వర‌ద పారిస్తున్నాడు. ఈ సీరిస్‌లో స్మీత్ ఇప్ప‌టి వ‌ర‌కు 671 పరుగులు సాధించాడు. సుమారు 135 సగటుతో పరుగుల దాహం తీర్చుకున్నాడు. 


ఈ ప‌రుగుల వ‌ర‌ద‌లో స్మీత్ భార‌త కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డును సైతం క్రాస్ చేశాడు. ఇక ప్ర‌పంచ టెస్ట్ క్రికెట్ చ‌రిత్ర‌లో మూడు టెస్ట్ మ్యాచ్‌లు లేదా అంత‌కు మించిన మ్యాచ్‌ల సీరిస్‌ల‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో స్మిత్‌ మూడో స్థానాన్ని ఆక్రమించాడు. ఇక ఈ క్ర‌మంలోనే స్మిత్ కోహ్లీతో పాటు పాక్ మాజీ ఆట‌గాడు మ‌హ్మ‌ద్ యూస‌ఫ్ రికార్డుకు సైతం చెద‌లు ప‌ట్టించాడు. 


2006-07 సీజన్‌లో వెస్టిండీస్‌తో  జరిగిన మూడు టెస్టు సిరీస్‌లో యూసఫ్‌ 665  పరుగులు సాధించాడు. ఇక 2017-18 సీజన్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో కోహ్లి 610 పరుగులు నమోదు చేశాడు. యాషెన్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం మూడు మ్యాచ్‌లు మాత్ర‌మే ఆడిన స్మిత్ కోహ్లి, యూసఫ్‌ల పరుగుల రికార్డును సవరించాడు. 


ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ గ్రాహం గూచ్ 1990లో భార‌త్‌తో జ‌రిగిన సీరిస్‌లో ఏకంగా 752 ప‌రుగులు చేశాడు. ఇదే ఇప్ప‌టి వ‌ర‌కు సీరిస్‌లో ఓ బ్యాట్స్‌మెన్ చేసిన హ‌య్య‌స్ట్ ర‌న్స్ రికార్డు. వెస్టిండీస్‌ దిగ్గజ ఆటగాడు బ్రియన్‌ లారా 2001-02 సీజన్‌లో శ్రీలంకపై 688 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: