టీం ఇండియా కెప్టెన్  విరాట్ కోహ్లీ సారథ్యం ఫై మాజీ ఓపెనర్  గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.  కోహ్లీ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడంటే  అది  ధోని , రోహిత్ శర్మ వల్లే నని గంభీర్ అన్నాడు. ఐపీఎల్ లో సక్సెస్ కాలేని కోహ్లీ  అంతర్జాతీయ  క్రికెట్ లో సారథిగా సక్సెస్ అవుతున్నాడంటే  దానికి  ధోని , రోహిత్ శర్మే  కారణమని  ...  ఓసారి వీరిద్దరూ లేకుండా  కోహ్లీని కెప్టెన్ గా  పరీక్షిస్తే  అప్పుడు అతని సత్తా బయటపడుతుందని   విమర్శించిన గంభీర్ .. ఐపీఎల్ లో  ధోని , రోహిత్ లు సక్సెస్ ఫుల్ కెప్టెన్లు గా నిరూపించుకున్నారు. కానీ  బెంగుళూరు తరుపున కోహ్లీ ఏం సాదించాలకేపోయాడు. ఈలీగ్ లో కెప్టెన్ గా  అతను  ఎలాంటి ఫలితాలు సాధించాడో పరిశీలిస్తే  వారిద్దరి అండ కోహ్లీ కి ఎంత అవసరమో తెలుస్తుంది అని వ్యాఖ్యానించాడు .   


అయితే  గంభీర్ వ్యాఖ్యలు కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించాయి.  పరిమిత ఓవర్ల క్రికెట్ ను మాత్రమే  పరిగణలోకి తీసుకొని అతను ఈవ్యాఖ్యలు  చేశాడని అర్ధం అవుతుంది. ఎందుకంటె టెస్టుల్లో  ధోని, రోహిత్ లేకుండా  గత కొంత కాలంగా కోహ్లీ సారథ్యంలో స్వదేశం లోనే కాకుండా విదేశాల్లో కూడా అద్భుతమైన విజయాలను సాధిస్తూ వస్తుంది  టీం ఇండియా.  అంతెందుకు ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన  టెస్ట్ సిరీస్ ను గెలిచి అత్యధిక టెస్ట్ మ్యాచ్ లను గెలిపించిన భారత  సారథిగా  కోహ్లీ రికార్డు సృష్టించాడు. మరి అలాంటప్పుడు  కేవలం ధోని , రోహిత్  కారణంగానే  కోహ్లీ కెప్టెన్ గా సక్సెస్ అవుతున్నాడనడం లో అర్ధం లేదు.  గంభీర్  అన్నట్టు ఐపీఎల్ లో కోహ్లీ  తన జట్టును  ఒక్కసారి కూడా  విజేతగా నిలుపలేకపోయాడు  అయితే దానికి  కోహ్లీ కెప్టెన్సీ  ఒక్కటే కారణం కాదు ఈ విషయాలను గంభీర్ మరిచిపోయినట్లున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: