టీ20ల్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ గత బుధవారం సాధించిన నెం.1 రికార్డ్‌పై ఓపెనర్ రోహిత్ శర్మ కన్నేశాడు. నేడు రాత్రి 7 గంటలకి  బెంగళూరు వేదికగా మూడో టీ20 మ్యాచ్‌  దక్షిణాఫ్రికాతో జరగనుండగా.. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 8 పరుగులు సాధిస్తే..? టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా వరల్డ్ రికార్డ్లో ఉండబోతున్నాడు. అప్పుడు విరాట్ కోహ్లీకి  రెండో స్థానానికి లభించననుంది. మొహాలి టీ20లో రోహిత్  12 పరుగులకే ఔటవగా.. విరాట్ కోహ్లీ అజేయంగా 72 పరుగులు చేసి టీమిండియాని గెలిపించాడు.

ఇప్పటి వరకూ టీ20ల్లో 71 మ్యాచ్‌లాడిన విరాట్ కోహ్లీ.. 50.85 సగటుతో 2,441 పరుగులు తీసాడు. ఈ ఫార్మాట్‌లో  కోహ్లీ స్ట్రైక్‌రేట్ 135.91గా ఉండగా.. 22 హాఫ్ సెంచరీలు జత చేసుకున్నాడు. మరోవైపు 97 టీ20 మ్యాచ్‌లాడిన రోహిత్ శర్మ 32.45 సగటుతో 2,434 పరుగులు తీసాడు.

 టీ౨౦ మ్యాచ్ ల్లో ఇప్పటికే రోహిత్  4 శతకాలు, 17 హాఫ్ సెంచరీలు సాధించగా.. విరాట్ కోహ్లీ మాత్రం కనీసం ఒక్క శతకం మార్క్‌ని కూడా దక్కించుకోలేకపోయాడు.నేడు జరగబోయే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రోహిత్ శర్మ తో పోలిస్తే  విరాట్ కోహ్లీకే మెరుగైన రికార్డ్ ఉంది. గతంలో ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కి ఆడిన విరాట్ కోహ్లీ‌కి.. చిన్నస్వామి స్టేడియం కొట్టినపిండి.

ఈ తరహాలో రోహిత్ శర్మ 8 పరుగులతో నెం.1 రికార్డ్‌ని ఒకవేళ సొంతం చేసుకున్నా.. నిమిషాల వ్యవధిలోనే ఆ రికార్డ్‌ని మళ్లీ కోహ్లీ సాధించేది  అవకాశం ఉంటుంది. దీనికి ముఖ్య కారణం పరుగులు తేడ తక్కువగా ఉండటమే..! ఒకవేళ వీళ్ళ ఇద్దరిలో ఎవరైనా.. బెంగళూరు టీ20 కనీసం హాఫ్ సెంచరీ తీసిన..? ఆ నెం.1 రికార్డ్ కొన్నిరోజుల పాటు నిలవనుంది. 


    మరింత సమాచారం తెలుసుకోండి: