మెగా స్టార్ చిరంజీవి నటించిన భారీ బడ్జెట్ చిత్రం సైరా విడుదలకు సిద్దమవుతుంది. అందులో  భాగంగా ఈ రోజు ఈ చిత్రం  సెన్సార్ కార్యక్రమాలను  పూర్తి చేసుకుంది.  పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో  తెరకెక్కిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఒక్క కట్ కూడా చెప్పకుండా  యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇక ఈసినిమా 164నిమిషాల  రన్ టైం తో  ప్రేక్షకులముందుకు రానుంది.  ఇటీవల విడుదలైన ఈచిత్రం యొక్క టీజర్ , ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా తాజాగా నిన్న విడుదలైన  లిరికల్  సాంగ్ కు కూడా అద్భుతమైన  స్పందన వస్తుంది.  ఈసినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో   చిత్ర యూనిట్  ప్రమోషన్స్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచింది.   



భారీ అంచనాల మధ్య  అక్టోబర్ 2, గాంధీ జయంతి  రోజున  ఈ చిత్రం తెలుగు తోపాటు  హిందీ , కన్నడ , మలయాళ , తమిళ భాషల్లో విడుదలకానుంది. ఇప్పటికే అన్ని భాషల్లో  ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పూర్తి కాగా  ఓవర్సీస్ లో ఈచిత్రాన్ని ఫార్స్ ఫిలిమ్స్ విడుదలచేస్తుంది. మరి  ఈఏడాది టాలీవుడ్ నుండి  మచ్ అవైటెడ్ చిత్రాల్లో  చివరి చిత్రంగా వస్తున్న సైరా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.  తొలి తరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి  జీవిత చరిత్ర ఆధారంగా సురేందర్ రెడ్డి   తెరకెక్కించిన ఈ చిత్రంలో  లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటించగా బాలీవుడ్ లెజెండరీ యాక్టర్   బిగ్ బి అమితాబ్ బచ్చన్,  జగపతి బాబు , విజయ్ సేతుపతి , రవి కిషన్   ,సుధీప్, తమన్నా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.  కొణిదెల ప్రొడక్షన్స్  పతాకంఫై  రామ్ చరణ్  నిర్మించిన ఈచిత్రానికి బాలీవుడ్  మ్యూజిక్  డైరెక్ట్ అమిత్ త్రివేది సంగీతం అందించాడు. తెలుగులో  ఆయనకు ఇదే మొదటి సినిమా. 

మరింత సమాచారం తెలుసుకోండి: