ధోని అంటే మిస్టర్ కూల్ కెప్టెన్ ఒక్కటే కాదు...బ్యాట్ పట్టి  హెలికాప్టర్ షాట్ లు బాదగలడు ... వికెట్ల  వెనకాల ఉండి రెప్పపాటు వికెట్లు పడగొట్టగలడు . అయితే  ధోని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు టీమ్ ఇండియా కి దొరుకుతాడా  అని  అనుకుంటున్న తరుణంలో  టీమిండియా జట్టు లోకి  రిషబ్ పంత్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే స్టార్టింగ్లో రిషబ్ పంత్ ఉరుములు మెరుపులు చూసి ధోని స్థానాన్ని పంత్ భర్తీ చేయగలడని ... ధోని వారసుడు అంటూ ప్రశంసలు కురిపించారు. 

 

 

 అయితే ధోని స్థానంలో ఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్ వరుస వైఫల్యాలతో జట్టులో తన స్థానానికి  ముప్పు  తెచ్చుకుంటున్నాడు. ధోని స్థానాన్ని భర్తీ చేసి బాగా రాణిస్తాడని  అనుకుంటున్నా రిషబ్ పంత్  ... పేలవ  ప్రదర్శన చేస్తుండడంతో ఇటు క్రికెట్ అభిమానులు అటు క్రికెటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో  పంతు  ఆటపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోని కోచ్ రవిశాస్త్రి,  చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ రిషబ్ పంత్ ని హెచ్చరించినట్లు కూడా ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. 

 

 

 అయితే రిషబ్ పంత్ పేలవ ప్రదర్శన చేస్తున్నాడని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో... ఆరు సిక్సుల వీరుడు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ రిషబ్ పంత్ కి మద్దతుగా నిలిచారు. గొప్ప వికెట్ కీపర్ అయిన మహేంద్రసింగ్ ధోని ఒక్కరోజులోనే గొప్ప ఆటగాడు కాలేదు... జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకోవడానికి ఎంతో సమయం పట్టిందని యువరాజ్ తెలిపాడు. ఇప్పుడు రిషబ్ పంత్ విషయంలో కూడా అలాగే భావించాలని... పంతం పై ఒత్తిడి పెంచడం సరైంది కాదన్నారు. రిషబ్ పంత్   నుంచి అత్యుత్తమ ఆట ఆశించే  వాళ్లు ముందు  పంత్ ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవాలని యువరాజ్ సింగ్ తెలిపారు. అయితే టి20 ప్రపంచకప్ కి  ఇంకా చాలా సమయం ఉన్నందున... పంతం పై ఒత్తిడి పెంచుకుండా  స్వేచ్ఛగా ఆడనిస్తే  పంత్ ఆటతీరు మెరుగుపడుతుందని యూవీ  అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: