భారత క్రికెట్ జట్టు విజయాల్లో గతం లో కీలక పాత్ర వహించిన ధోని , యువరాజ్ మధ్య వైరం ఉందన్న వాదనలు లేకపోలేదు. యువరాజ్ కెప్టెన్ కాకుండా అడ్డుకున్న వారిలో ధోని ఒకరంటూ యువరాజ్ తండ్రి యోగరాజ్ పలుసార్లు అభిశంసించిన విషయం తెల్సిందే. కానీ యువరాజ్ మాత్రం  ఏనాడూ ధోని కి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు . తాజాగా   మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్డ్ యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలన్న సీనియర్ల ప్రతిపాదనను  సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ తోసిపుచ్చాడు.


 ధోని రిటైర్మెంట్ పై విస్తృతంగా చర్చ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో యువరాజ్ స్పందిస్తూ ... ధోనీ రిటైర్మెంట్ గురించి మనమంతా చర్చించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు.  భారత క్రికెట్ కు అతడు ఎంతో సేవ చేశాడని అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడని, రిటైర్మెంట్ గురించి  ధోనికి ఆలోచించుకునే సమయం ఇవ్వాలని సూచించాడు.  వరల్డ్ కప్ తర్వాత ధోని క్రికెట్ నుంచి వైదొలుగుతాడని అందరూ భావించారు.  కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ,  ధోని క్రికెట్ నుంచి రిటైర్ కాకుండా కాసింత విశ్రాంతిని కోరుకున్నాడు.


 ఆర్మీలో చేరి కాశ్మీర్ లో విధులు నిర్వహించేందుకు వెళ్ళాడు . ఆర్మీ నుంచి  తిరిగి వచ్చినప్పటికీ నవంబర్ వరకు సెలక్టర్ల కు అందుబాటులో ఉండటం లేదని స్వయంగా ప్రకటించాడు.  అయితే భారత జట్టు తలుపులను  యువ క్రికెటర్ల తడుతోన్న ప్రస్తుత  సమయంలో, జట్టులో  ధోని స్థానం ప్రశ్నార్థకంగా మారింది. వికెట్ కీపర్ స్థానం కోసం వర్ధమాన క్రికెటర్లు పలువురు పోటీ పడుతున్నారు . ఇప్పటికే టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ధోని , ప్రస్తుతం వన్డే , టి ట్వంటీ లు మాత్రమే ఆడుతున్నాడు .  


మరింత సమాచారం తెలుసుకోండి: