మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని... టీమిండియా క్రికెట్ చరిత్రలో అరుదైన క్రికెటర్. ఒకసారి బ్యాట్ పడితే హెలికాప్టర్ షాట్ బాదేస్తు బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు.  వికెట్ల వెనుక ఉండి రెప్ప పాటు సమయంలో బ్యాట్ మెన్స్ ని  పెవిలియన్ పంపించగలడు ధోని . వికెట్ల వెనుక ఉండి తన వ్యూహాలతో మ్యాచ్  ని విజయ తీరాలా వైపు  నడిపిస్తాడు ధోని. ప్రత్యర్థి జట్టు ఎంత బలమైనది  అయినా ధోని వ్యూహం ముందు అపజయం పాలవ్వాలసిందే . టీమ్ ఇండియా జట్టు కి రెండు  ప్రపంచ కప్ లు   అందించిన గొప్ప ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ. అందుకే ధోనికి అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ధోని ఒక్కసారి మైదానంలోకి అడుగు పెడితే అభిమానులు ఏదో తెలియని కరెంటు పాస్ అవుతుంది. 

 

 

 అయితే గత కొన్ని రోజులుగా మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని సరైన ఫామ్ లో  లేకపోవడం తో ధోని పని అయిపోయిందని రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే ప్రపంచ కప్ లో ధోనీ ఆటను చూసి అభిమానులు కూడా కాస్త హర్ట్ అయ్యారు. ఇప్పటికే మాజీ క్రికెటర్లు కూడా ధోని రిటైర్మెంట్ ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందని కొంచెం లేట్ చేస్తే ఘన వీడ్కోలు కోల్పోతాడని విమర్శించిన విషయం తెలిసిందే. 

 

 

 అయితే ప్రపంచకప్ తర్వాత అందరు ధోని  రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అనుకున్నారు. కానీ తనకు ఆటలో కొంచెం గ్యాప్ కావాలని బిసిసిఐ  అనుమతి తీసుకొని ఆర్మీ లో విధులు నిర్వహించిన విషయం తెలిసిందే.  ఆ తర్వాత ఆర్మీ నుండి వచ్చినప్పటికీ నవంబర్ వరకు అందుబాటులో ఉండని తానే స్వయంగా  బిసిసిఐకి తెలిపాడు . అయితే ఈ నేపథ్యంలో ధోని రిటైర్మెంట్ పై వార్తలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో మహేంద్ర సింగ్ ధోనీ స్నేహితుడు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ధోనీ రిటైర్మెంట్ పై స్పందించాడు. 

 

 

 ధోని ఒక గొప్ప ఆటగాడని... క్రికెట్ కి ఎప్పుడు వీడ్కోలు పలకాలని దానిపై నిర్ణయం ధోనీకే  వదిలేయాలని యూవీ  చెప్పాడు. ధోని  ఇంకా ఆడాలని కోరుకుంటే  అతని మనమంతా గౌరవించాలని చెప్పాడు. ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తే అతని స్థానాన్ని భర్తీ చేయడం ఎంతో కష్టతరమైన పనని ... ధోని  ఇండియాకు ఎన్నో అరుదైన విజయాలు అందించాడని ... అలాంటి గొప్ప ఆటగాడిని గౌరవించాల్సిన బాధ్యత మనపై ఉందని యువరాజ్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: