భారత అగ్రశ్రేణి క్యూ స్పోర్ట్స్‌ ఆటగాడు పంకజ్‌ అడ్వాణీ ప్రపంచ టైటిళ్ల తో ఆనందంలో మునిగి ఉన్నాడు. సరి కొత్త అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తోన్నపంకజ్‌ అడ్వాణీ జోసుకు  అడ్డుకట్ట వేసేవాళ్లే ఎవరు లేరు అని కనిపిస్తుంది. అడుగుపెట్టిన ప్రదేశాలలో విజయాలు సాధిస్తున్న  అతను మరో ప్రపంచ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఆదిత్య మెహతాతో కలిసి ప్రపంచ స్నూకర్‌ టీమ్‌ విభాగంలో ఛాంపియన్‌గా నిలిచాడు.

పంకజ్‌కు ఇది 23వ ప్రపంచ టైటిల్‌ కాగా.. ఆదిత్యకు ఇదే మొదటిది. బుధవారం ఫైనల్లో పంకజ్‌- ఆదిత్య జోడీ 5-2 తేడాతో థాయ్‌లాండ్‌పై నెగ్గింది. తొలి సింగిల్స్‌లో ఆదిత్య గెలిచి శుభారంభం అందించాడు. అయితే రెండో సింగిల్స్‌లో పంకజ్‌ అనూహ్యంగా పరాజయం చెందాడు. డబుల్స్‌లో మాత్రం భారత జోడీ వెనక్కు తగ్గలేదు. పూర్తి ఆధిపత్యం చలాయించి విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ టైటిల్‌తో ఐబీఎస్‌ఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లన్నింట్లోనూ విజేతగా నిలిచిన ఏకైక ఆటగాడిగా పంకజ్‌ చరిత్ర సృష్టించాడు.

‘‘మయన్మార్‌ నుంచి 3 వారాల్లో రెండు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ స్వర్ణాలు (బిలియర్డ్స్‌, స్నూకర్‌), ఓ కాంస్యం (ప్రపంచ 6- రెడ్‌ స్నూకర్‌)తో తిరిగి వెళ్తున్నా. ఇప్పటి వరకు నా ఖాతాలో చేరని ప్రపంచ స్నూకర్‌ టీమ్‌ టైటిల్‌ను ఇప్పుడు గెలుచుకున్నందుకు గాల్లో తేలుతున్నా’’ అని పంకజ్‌ తెలిపాడు .

ఫ్రేమ్లో పంకజ్ గెలిచి మ్యాచ్ ను  కూడా విజయం కైవసం చేసుకున్నాడు.మొత్తం  ఆరేళ్లలో - ఐదు సార్లు విజేతగా గెలవడం ప్రత్యేకంగా అనిపిస్తోంది. ప్రపంచ ఛాంపియన్షిప్ బరిలో ఉన్న  ప్రతిసారి విజేతగా నిలవాలనే నా ప్రేరణ నాకు తగ్గలేదని నిరూపించేందుకు ప్రయత్నిస్తూనే ఉనాన్ను. నా విజయాలు  ఆకలి, నా సత్తాను ఈ టైటిల్ నాకు రావడంతో తెలియచేసింది అనిఅడ్వాణీ తెలిపారు 


మరింత సమాచారం తెలుసుకోండి: