భారత జట్టు టి ట్వంటీ , ప్రపంచ కప్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన యువరాజ్ సింగ్ అత్యంత అవమానకర రీతిలో క్రికెట్ కు ఇటీవల వీడ్కోలు చెప్పాడు . జట్టు మేనేజ్ మెంట్ కనీసం అతనికి చివరి మ్యాచ్ ఆడే అవకాశం కూడా కల్పించలేదు . యువ ఆటగాళ్ల రాకతో జట్టు తలుపులు మూసుకుపోయాయని భావించిన యువీ, తన సన్నిహితుల మధ్య రిటైర్మెంట్ ప్రకటించాడు . అయితే అప్పుడు తనకు జరిగిన అన్యాయం పై నోరు విప్పని యువీ ... తాజాగా ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాత్రం జట్టు మేనేజ్ మెంట్ , సెలెక్టర్లపై తీవ్ర విమర్శలు చేశాడు .  


భారత్ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను ఒంటిచేత్తో అందించిన తనని సెలెక్టర్లు , మేనేజ్ మెంట్  కక్షకట్టి జట్టు నుంచి తప్పించిందని పరోక్షంగా చెప్పుకొచ్చాడు ఈ డాషింగ్ ఆల్ రౌండర్. తనకు  కనుక సరైన సమయంలో మరిన్ని అవకాశాలు ఇచ్చి ఉంటే తాను ఇంత త్వరగా క్రికెట్ కు వీడ్కోలు పలికే వాడిని కానని  అన్నాడు . 2011 తర్వాత మరో ప్రపంచ కప్ ఆడకపోవడం  నన్ను చాలా బాధించే విషయమని చెప్పాడు . ప్రపంచకప్ టోర్నీ లో యువీ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచిన విషయం తెల్సిందే .


  సెలెక్టర్లు తనకు మద్దతిచ్చి ఉంటే మరొక ప్రపంచకప్ ఆడేవాడినన్న యువీ , గాయం తరువాత జట్టులోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నించానని చెప్పాడు .  36 ఏళ్ళ వయస్సులో యో యో  టెస్ట్ పాస్ అయిన తర్వాత కూడా జట్టులో అవకాశం కల్పించకుండా , దేశవాళీ టోర్నీ లో పాల్గొనాలని సూచించి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశాడు . 2011 ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత జరిగిన ఎనిమిది తొమ్మిది మ్యాచుల్లో  తాను రెండు సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సాధించిన  తనకు అవకాశాలు ఇవ్వలేదన్నాడు .


మరింత సమాచారం తెలుసుకోండి: