గత  కొన్నేళ్లుగా  మూడు ఫార్మాట్ లకు  కెప్టెన్ గా వ్యవహరిస్తూ   జట్టును ముందుండి నడిపిస్తున్నాడు   టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.  అయితే     వన్డే , టెస్టుల్లో కోహ్లీ  ఎన్నో  అద్భుతమైన విజయాలను అందించాడు కానీ  టీ 20ల్లో మాత్రం కొంత తడబడుతున్నాడు.  దాంతో  పొట్టి ఫార్మాట్ లో రోహిత్ శర్మ ను కెప్టెన్ గా నియమించాలని  ఇటీవల  సీనియర్ క్రికెటర్లతో  పాటు రోహిత్ అభిమానులు తమ  అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.  తాజాగా ఈ జాబితాలో  టీం ఇండియా మాజీ స్థార్ అల్ రౌండర్  యువరాజ్ సింగ్  కూడా చేరాడు. ఓ ఇంటర్వ్యూ లో  ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ  యువీ .. విరాట్ కోహ్లీ   సారథ్యం ఫై సంచలన వ్యాఖ్యలు చేశాడు.  కోహ్లీ  ని మూడు ఫార్మట్ లకు కెప్టెన్ గా నియమించడం వల్ల అతనికి  పని భారం ఎక్కువతుందని  అందువల్ల  టీ 20ల్లో భారత్ అనుకున్న స్థాయిల్లో  ఫలితాలు రాబట్టడం లేదని  యువీ  అభిప్రాయపడాడ్డు.  




టీ 20 ల్లో రోహిత్ శర్మ ను కెప్టెన్ గా నియమించాలి.  అందుకు  రోహిత్ అర్హుడు అని  ఇప్పటికే నిరూపించుకున్నాడు.   ఐపీఎల్ లో నాలుగు సార్లు  ముంబై ఇండియన్స్ ను ఛాంపియన్ గా నిలిపాడు  .. కోహ్లీ మాత్రం  ఆలీగ్ లో  దారుణంగా  ప్లాప్ అయ్యాడు.  అందుచేత  టీ 20ల్లో  రోహిత్ ను కెప్టెన్ గా ఉంచితే  జట్టకు మేలు జరుగుతుంది. టీ 20ప్రపంచ కప్ కు సమయం దగ్గర పడుతున్నందున  మేనేజ్ మెంట్  ఈ విషయం గురించి ఆలోచించి  రోహిత్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని యువరాజ్ పేర్కొన్నాడు.  అయితే  ఇటీవల  వెస్టిండీస్   పర్యటన సమయంలోనే   కోహ్లీ కి రెస్ట్ ఇచ్చి రోహిత్ ను  కెప్టెన్ చేయాలని మేనేజ్ మెంట్ భావించింది. కానీ చివరి నిమిషంలో నేను ఆడుతాను అని జట్టుతో చేరి  రోహిత్ కు కెప్టెన్సీ దక్కకుండా చేశాడు కోహ్లీ. 


మరింత సమాచారం తెలుసుకోండి: