స్పాట్ ఫిక్సింగ్ లో అడ్డంగా దొరికిపోయి  అర్ధాంతరంగా  కెరీర్ ను ముగించిన  కేరళ పాస్ట్ బౌలర్ శ్రీశాంత్...   చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై తన కోపానికి కారణాలు వెల్లడించాడు.  ఇటీవల  రాజస్థాన్  రాయల్స్  కోచ్ పాడి అప్టన్ రాసిన ఆటో బయోగ్రఫీ లో  శ్రీశాంత్ ను చెన్నై సూపర్ కింగ్స్ పై  ఆడించనందుకే తనను దూషించడాని పేర్కొన్నాడు.  పనిలో పనిగా దీనిపై కూడా  వివరణ ఇచ్చాడు శ్రీశాంత్. 



ఈ ఆరోపణల పై  స్పందించిన శ్రీశాంత్ ... ఆప్టన్  మీ గుండెల మీద  చేయివేసుకొని చెప్పండి నేను ఎప్పుడైనా  మిమ్మల్ని దూషించానా ?  అలాగే నాకెంతో ఇష్టంమైన క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ ను కూడా  ఈ సందర్భంగా ఓ ప్రశ్న అడుగుతున్నాను. ఆప్టన్  రాసినట్లు నేనుఎప్పడైనా అతన్ని  విమర్శించనా  అని  శ్రీశాంత్ పేర్కొన్నాడు.  చెన్నై పై  తనను ఆడించాలని  ఆప్టన్ ను  చాలా సార్లు కోరానని అయితే దానికి అతను అంగీకరించలేదని .. ఆజట్టుపై నాకు మంచి రికార్డు ఉన్నందునే అతన్ని  బలవంతం చేశాను తప్ప దూషించలేదని  శ్రీశాంత్ వెల్లడించాడు.   ఇక అ ఇక అందరు ధోని , ఎన్ శ్రీనివాసన్ వల్లనే నేను చెన్నై జట్టును  అసహ్యించుకుంటానని అనుకుంటారు కానీ అది నిజం కాదు. నాకు పసుపు రంగు అంటే నచ్చదు అందుకే ఆజట్టు అంటే కోపమని అలాగే ఆస్ట్రేలియా జెర్సీ కూడా ఎల్లో నే కాబట్టి ఆ జట్టును  కూడా  అసహ్యించుకుంటానని  శ్రీశాంత్ పేర్కొన్నాడు.  మరి శ్రీశాంత్ వ్యాఖ్యల పై  చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: