టీం ఇండియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య  జరుగనున్న మూడు మ్యాచ్ ల  టెస్ట్ సిరీస్ కు  రేపటి తో తెరలేవనుంది.  రేపు వైజాగ్ వేదికగా  ఇరు జట్ల  మధ్య  మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది.  సొంత గడ్డఫై భారత్ హాట్ ఫెవరేట్ గా  బరిలోకి దిగుతుండగా  అనుభవ లేమి ఆటగాళ్లతో  తో కూడుకున్న  సౌత్ ఆఫ్రికా కాస్త బలహీనంగానే కనిపిస్తుంది. అయితే ఆ జట్టును  ఏ మాత్రం తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఇక   ఇటీవల వరుసగా  విఫలమవుతూ  తీవ్ర విమర్శలను ఎదుర్కుంటున్న  యువవికెట్ కీపర్  రిషబ్ పంత్ కు  తొలి  టెస్ట్ ముందు  షాక్ ఇచ్చాడు  కెప్టెన్ విరాట్ కోహ్లీ.




తాజాగా జరిగిన  మీడియా సమావేశంలో  కోహ్లీ మాట్లాడుతూ ..   వైజాగ్  టెస్ట్ కు కీపర్  వృద్ధిమాన్  సాహా ను తుది జట్టులోకి తీసుకోనున్నామని  వెల్లడించాడు.  సాహా తో పాటు ప్రధాన స్పిన్నర్  అశ్విన్ కూడా  తుది జట్టులోకి   రావడం ఖాయమని కోహ్లీ పేర్కొన్నాడు.  అయితే ఇటీవల  వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ కు అశ్విన్ పక్కకు పెట్టడం తో అప్పట్లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.  ఇప్పుడు  స్వదేశం లో  జరుగుతున్న టెస్ట్ సిరీస్ కావడంతో   కోహ్లీ మరో సారి ఆ రిస్క్  చేయడంలేదు.  కాగా  స్వదేశీ పిచ్ లపై  అశ్విన్ ఎంతప్రమాదకారో తెలిసిందే.   ఈమ్యాచ్ లో  కూడా అతను విజ్రంభిస్తే  సౌత్ ఆఫ్రికా కు కష్టాలు తప్పకపోవచ్చు. ఇక ఈ మ్యాచ్ ద్వారా టెస్ట్ కెరీర్ లో తొలిసారి ఓపెనర్ గా రానున్నాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.  అయితే ప్రపంచ కప్  తరువాత ప్రస్తుతం పేలవఫామ్ లో వున్న రోహిత్ పైన  ఇప్పుడు అందరి కళ్ళు  వున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: