దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో భారత బౌలర్లు చెలరేగిపోయారు. బ్యాటింగ్ లో రోహిత్ శర్మ సెంచరీ ,మయాంక్ అగర్వాల్ డబల్ సెంచరీలతో మెరుపులు మెరిపిస్తే, మన బౌలర్లు అంతకుమించి అనిపించేలా చేశారు. మన బౌలర్ల దాడికి దక్షిణాఫ్రికా బ్యాటర్లు బెంబేలెత్తిపోయి మ్యాచ్ ని వదులుకున్నారు. ఆది నుండి మన బౌలర్లు దక్షిణాఫ్రికాపై పై చేయి సాధిస్తూ వచ్చారు.


395 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కి దిగిన దక్షిణాఫ్రికాకి ఇన్నింగ్స్ రెండవ ఓవర్లోనే దెబ్బ పడింది. అశ్విన్ బౌలింగ్ ఓపెనర్ ఆటగాడు డిబ్రుయిన్ పది పరుగులకే ఔటయ్యాడు. ఆ తర్వాత షమీ వేసిన ఓవర్లో తెంబ బవుమా డకౌట్ అయ్యాడు. దాంతో దక్షిణాఫ్రికా పతనం ప్రారంభమైంది. ఆ తర్వాత జడేజా వరుసగా వికెట్లు తీసుకున్నాడు. ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.


మొత్తానికి మన బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా బ్యాటర్లు నిలబడలేకపోయారు. 395 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో వాళ్ళు చతికిల పడ్డారు. దాంతో భారీ తేడాతో ఇండియా ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో వికెట్లు తీయడం ద్వారా టెస్టుల్లో అత్యంత వేగంగా 350 వికెట్లు తీసిన వాడిగా రికార్డు సాధించాడు. 66 వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న అశ్విన్ ఈ ఘనతని సొంతం చేసుకున్నాడు.


ఇంతకుముంది ఈ రికార్డు మురళీధరన్ పేరుపై ఉండేది. అయితే మురళీధరన్ కూడా తన  66వ టెస్ట్ మ్యాచ్ లోనే ఈ ఘనత సొంతం చేసుకోవడం విశేషం.  ఇద్దరూ స్పిన్నర్లే కావడం మరో విశేషం. బౌలర్లు తమ జోరు చూపించిన ఈ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ లో షమీ ౫ వికెట్లు, జడేజా ౪ వికెట్లు, అశ్విన్ ఒక వికేట్ తీసుకున్నాడు. 


ఇంతకుముంది ఈ రికార్డు మురళీధరన్ పేరుపై ఉండేది. అయితే మురళీధరన్ కూడా తన  ౬౬వ టెస్ట్ మ్యాచ్ లోనే ఈ ఘనత సొంతం చేసుకోవడం విశేషం.  ఇద్దరూ స్పిన్నర్లే కావడం మరో విశేషం. బౌలర్లు తమ జోరు చూపించిన ఈ మ్యాచ్ లో 203 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది.





మరింత సమాచారం తెలుసుకోండి: