దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో ఇండియా ఘనవిజయాన్ని సాధించింది.  ఈ మ్యాచ్ లో రికార్డుల మీద రికార్డులు నమోదయ్యాయి. మన బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా విలవిలలాడిపోయింది. ఈ మ్యాచ్ లో చాలా రికార్డులు నమోదయ్యాయి. అయితే ఈ మ్యాచ్ లో తనదైన బ్యాటింగ్ శైలితో ఆకట్టుకున్న రోహిత్ శర్మ...రెండు ఇన్నింగ్స్ లో రెండు సెంచరీలతో పాటు ఓపెనర్ గా దిగిన మొదటి మ్యాచ్ లోనే రెండు సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.


అప్పటి వరకు టెస్ట్ లకి పనికిరాడు అని తనమీదున్న అపవాదును తరిమికొట్టి, ఏ ఫార్మాట్ లోనైనా తాను ఆడగలడని నిరూపించాడు. అయితే ఈ మ్యాచ్ లో ఆటతో అందరినీ ఆకట్టుకున్న రోహిత్ శర్మ, తన నోటికి కూడా పని చెప్పాడు. తన సహచర ఆటగాడు ఛతేశ్వర పుజారా పై నోరు పారేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.


రోహిత్ శర్మ ఒక పరుగు తీద్దామని ప్రయత్నిస్తుండగా అటువైపు ఎండ్ లో ఉన్న పుజారా సరిగ్గా స్పందించలేదు. దాంతో అతనిపై తిట్ల వర్షం కురిపించాడు. ఆ తిట్లన్నీ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న మైక్ లో రికార్డ్ అయ్యాయి.  రోహిత్ పుజారాని తిట్టడం సరికాదని చాలా మంది విమర్శిస్తున్నారు. అయితే కొంతమంది రోహిత్ ని సమర్థిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు.


ఈ ఘటనపై ఇంగ్లండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ ట్విట్టర్ లో తనదైన శైలిలో స్పందించాడు. గతంలో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ దూషించడాన్ని పరోక్షంగా గుర్తు చేస్తూ.. ఇది రొహిత్ సమయం.. కోహ్లీది కాదు. ఒకవేళ కోహ్లీ నుండి ఆ తిట్టు వచ్చి ఉంటే అదేమై ఉంటుందో అందరికీ తెలిసే ఉంటుంది అని ఎద్దేవా చేశాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: