వైజాగ్ వేదికగా భారత్ - దక్షిణాఫ్రికా మధ్య  జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించింది. 203 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్నిభారత్ ఖాతాలో వేసుకుంది. 395 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లను కేవలం 191 పరుగులకే ఆలవుట్ చేసి ఘనవిజయంని సొంతం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్లో భారత్ తొలి ఇన్నింగ్స్ 502/7 డిక్లేర్డ్ రెండో ఇన్నింగ్స్ 323/4 డిక్లేర్డ్ చేసింది. ఇక దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 431 ఆలౌట్ రెండో ఇన్నింగ్స్ 191 ఆలౌట్ అయ్యి పోయింది.


ఈ మ్యాచ్ విజయం  పలు రికార్డులకు వేదికగా నిలిచింది. ఓపెనర్గా తొలి టెస్ట్లోనే రోహిత్శర్మ రెండు ఇన్సింగ్స్లలో సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డ్స్ లో నిలిచాడు. ఇప్పటి వరకు ఏ ఆటగాడికి ఈ అరుదైన రికార్డు లభించ లేదు. 


ఇక దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్స్ పీయుడ్త్ 10వ స్థానంలో బ్యాటింగ్కు దిగి హాఫ్ సెంచరీ కొట్టడం ద్వారా భరత్ పై  ఆ ఘనత సాధించిన తొలి సఫారీ బ్యాట్స్ మ్యాన్ గా  నిలిచాడు. అలాగే సిక్సర్ల రికార్డు కూడా సాధించింది . ఈ మ్యాచ్లో ఇరు జట్లు కలిపి మొత్తం 37 సిక్సర్లు తీశారు.  ఓ టెస్ట్ మ్యాచ్లో ఎక్కువ సిక్సులు సాధించిన మ్యాచ్గా నిలిచింది.


ఇక భారత్  జట్టు మాత్రం  తన తొలి ఇన‍్నింగ్స్లో 13 సిక్సర్లు.. మరియు  రెండో ఇన్సింగ్స్లో 14 సిక్సర్లు లతో రికార్డ్స్ లో నిలిచింది. ఇక దక్షిణాఫ్రికా తొలి ఇన్సింగ్స్లో 7 రెండో ఇన్సింగ్స్లో 3 సిక్సర్లు సాధించింది సరిపెట్టుకుంది. రవీంద్ర జడేజా వేసిన 35 ఓవర్లో  సిక్స్ను కొట్టడం ద్వారా పాకిస్తాన్-న్యూజిలాండ్ల పేరిట ఉన్న 35 సిక‍్సర్ల రికార్డును బద్దలు చేసింది . ఏదేమైనా సరే  వైజాగ్ టెస్ట్లో భారత్ విజయం సాధించడంతో పాటు పలు వరల్డ్ రికార్డులు బ్రేక్ చేసింది అని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: