టీమిండియా క్రికెటర్  హార్దిక్ పాండ్యా మరో వివాదంలో చిక్కుకున్నాడు. గతం లో ఒక టీవీ షో లో  మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రెండు మ్యాచ్ ల నుంచి హార్దిక్ ను బిసిసిఐ బహిష్కరించిన విషయం కూడా తెల్సిందే . మైదానం లో దూకుడుగా ఉండే హార్దిక్ , ట్విటర్ లోనూ అదే దూకుడు ప్రదర్శించబోయి అభాసుపాలవుతున్నాడు .    తాజాగా టీమిండియా మాజీ పేస్ బౌలర్  జహీర్ ఖాన్ బర్త్ డే సందర్భంగా హార్దిక్ చేసిన  ట్వీట్  ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.  దీనిపై  విమర్శకులు,  జహీర్ ఖాన్  అభిమానులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  హార్దిక్ చేసిన ట్వీట్ పై జహీర్  కూడా ఘాటుగానే స్పందించాడు.


 ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు అంటూనే ... నీలా బ్యాటింగ్ నేను ఎప్పటికీ బ్యాటింగ్  చేయలేను,   కానీ ఈ మ్యాచ్ లో నువ్వు  నా నుంచి ఎదుర్కొన్నతరువాత బంతి లాగే  నా పుట్టినరోజు చాలా బాగా జరిగింది అంటూ జాక్  గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు.  జహీర్ ఖాన్ బర్త్ డే సందర్భంగా హార్థిక్ పాండ్యా   ట్విట్టర్ లో  హ్యాపీ బర్త్ డే జాక్ నేనిక్కడ కొట్టినట్టుగానే  నువ్వు కూడా మైదానం బయటకు  బంతిని కొడుతావని   ఆశిస్తున్నానని  అంటూ దేశవాళీ  మ్యాచ్ లో జాక్ బౌలింగ్ లో సిక్సర్ కొట్టిన  వీడియో జత చేసి  ట్వీట్ చేశాడు.


 దీనిపై జాక్  అభిమానులు మండిపడుతున్నారు.  ముందు టీమిండియాకు జాక్ లా    ప్రపంచకప్ తీసుకురా అంటూ కామెంట్ చేస్తున్నారు.  ఇక హార్దిక్ ప్రస్తుతం లండన్ లో  వెన్ను నొప్పి గాయానికి చికిత్స పొందుతున్నాడు.  ప్రస్తుతం కోలుకుంటున్న హార్దిక్ త్వరలోనే మైదానంలో అడుగుపెడతానని ఆశిస్తున్నాడు.  అయితే గాయం తీవ్రత జరిగిన శాస్త్ర చికిత్స ను పరిశీలిస్తే ఐదు నెలల పాటు హార్దిక్ కు  విశ్రాంతి అవసరమని  వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: