విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ పలు రికార్డులు నమోదయ్యాయి. ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్ లో భారత్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. బౌలర్లకి ప్రత్యేకమైన ఈ మ్యాచ్ లో భారత ఆఫ్ స్పిన్నర్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. అశ్విన అత్యంత వేగంగా 350 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. అశ్విన్ తన 66 వ మ్యాచ్ లో ఈ రికార్డును సాధించాడు. ఫాస్ట్ గా 350 వికెట్లు సాధించిన వారిలో ముత్తయ్య మురళీధరన్ తో కలిసి మొదటి స్థానాన్ని పంచుకున్నాడు.


ఈ నేపథ్యంలో అతని అభిమానులు ప్రశంసలు కురిపిస్తుంటే, మరికొంత మంది విమర్శిస్తున్నారు. అశ్విన్ ఉపఖండ పిచ్ లపై తప్ప వేరే దేశాల్లో వికెట్లు పడగొట్టలేడని అతనిపై తమ అక్కసును వెళ్ళగక్కుతున్నారు. అయితే తాజాగా హర్భజన్ అశ్విన్ ని సపోర్ట్ చేస్తూ విమర్శిస్తున్న వారిపై తన ఆగ్రహాన్ని ప్రదర్శించాడు. హర్భజన్ మాట్లాడుతూ... క్రికెట్‌పై సరైన అవగాహన లేని వారు అశ్విన్‌ను టార్గెట్‌ చేసి విమర్శిస్తున్నారు.


కేవలం స్వదేశంలో రాణించగలడని అంటే మిగతా స్పిన్నర్లు అశ్విన్ లా ఎందుకు రాణించలేకపోతున్నారు.  అశ్విన్ ఎలాంటి పిచ్ లో నైనా ఆడగలడు. పరిస్థితికి తగ్గట్టు అతడు బౌలింగ్ చేస్తాడు. స్పిన్ ట్రాక్ లపై అతడు బౌలింగ్ లో అద్భుతమైన వేరియేషన్స్ చూపగలడు. కేవలం 66 టెస్టుల్లోనే 350 వికెట్లు​ పడగొట్టడం మామూలు విషయం కాదు. ప్రస్తుతం ఉన్న స్పిన్నర్లలో అశ్విన్ కంటే మెరుగ్గా ఆడే వాళ్ళు లేరు.


అశ్విన్ అతి త్వరలోనే నా రికార్డును(417 వికెట్లు) అధిగమిస్తాడు. అంతేకాదు 600 వికెట్ల మైలురాయిని చేరుకోవడం అతనికి పెద్ద కష్టం కాదు. మరికొద్ది రోజుల్లో అది కూడా చూడబోతున్నాం అని జోస్యం చెప్పాడు. మరి భజ్జీ జోస్యం ఫలిస్తుందా లేదా అనేది చూడాలి.






మరింత సమాచారం తెలుసుకోండి: