భారత ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్య మరోసారి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికే మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశాడని విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీనివల్ల అతన్ని మ్యాచుల నుండి తప్పించాలనే వార్తలు కూడా వచ్చాయి. ఆ వివాదం సద్దుమణిగిందనుకుంటే హార్థిక్ కొత్తగా మరో కొత్తదాన్ని నెత్తిన పెట్టుకున్నాడు. తాజాగా హార్థిక్ చేసిన ఒక ట్వీట్ ఈ వివాదానికి కారణమైంది.


జహీర్ పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలిపిన హార్థిక్ పాండ్యా ఒక వీడియోని పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో హార్థిక్ జహీర్ బౌలింగ్ లో బంతిని బౌండరీకి బాదుతున్నాడు. ఇలాంటి వీడియో పోస్ట్ చేసి నువ్వు కూడా నాలా దంచి కొడతావని ఆశిస్తున్నానంటూ కామెంట్ చేశాడు. బౌలర్ అయిన జహీర్ ఖాన్ ని ఇలా అనడంతో జహీర్ అభిమానులు హార్థిక్ పై మండి పడుతున్నారు. ఒక సీనియర్ ఆటగాడిని ఉద్దేశించి ఇలా మాట్లాడటం అతని అహంకారాన్ని తెలియజేస్తుందని అంటున్నారు.


అయితే తాజాగా జహీర్ ఖాన్ హార్థిక్ కి కౌంటర్ ఇచ్చాడు. ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపినందకు హార్దిక్‌కు ధన్యవాదాలు. అయితే నీలా బ్యాటింగ్‌ నేనెప్పటికీ చేయలేను. కానీ నువ్వు పెట్టిన వీడియోలోని మ్యాచ్‌లో నువ్వు నా నుంచి ఎదుర్కొన్న తర్వాతి బంతి వలే నా పుట్టినరోజు చాలా బాగా జరిగింది’ అంటూ హార్దిక్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చాడు.


అయితే జహీర్ ఆ తర్వాతి బంతి వీడియో పోస్ట్ చేయలేదు. హార్థిక్ కి  కౌంటర్ ఇవ్వడంతో  జహీర్ అభిమానులు చాలా బాగా చెప్పావంటూ పొగుడుతున్నారు. మరి దీనిపై హార్థిక్ ఇంతవరకు స్పందించలేదు. జహీర్ అభిమానులు మాత్రం చాలా మంచి కౌంటర్ ఇచ్చాడని చెప్పుకుంటున్నారు. వెన్ను నొప్పి కారణంగా మ్యాచ్ లకు దూరమైన హార్థిక్ పాండ్య లండన్ లో సర్జరీ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: