ఇటీవల కాలంలో  ప్రపంచ క్రికెట్ లో   భారత  ప్రధాన కోచ్ రవిశాస్త్రి పై వచ్చిన  ట్రోల్స్ మరేకోచ్ పై  రాలేదేమో. కొద్దీ రోజుల  క్రితం రవిశాస్త్రి  టైటానిక్ పోజ్లో వున్న ఫోటో ఒకటి  బయటికి రాగ దాని పై  క్రికెట్ అభిమానులు ట్రోల్స్ చేశారు.   తాజాగా రాంచి వేదికగా  సౌతాఫ్రికా భారత్ లమధ్య జరుగుతున్న చివరిటెస్ట్  రెండో రోజు  భారత్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో  పెవిలియన్ లో వున్న రవిశాస్త్రి ఓ కునుకు తీశాడు.  అది కాస్త  కెమెరా కంటికి చిక్కింది. ఇక వెంటనే ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. దాంతో  ఆ ఫొటోలను చూసిన నెటిజన్లు .. రవిశాస్త్రి పై జోకులు వేశారు.  ఏడాదికి 10కోట్లు  తీసుకుంటూ మ్యాచ్ జరుగుతుంటే  నిద్రిస్తున్నాడు నీ అంత అదృష్టవంతుడు ఇంకొకరు వుండరు అని ఒకరు కామెంట్ చేయగా మరొకరు కేవలం నిద్రపోతునందుకు రవిశాస్త్రికి 10 కోట్లు ఇస్తుంది .. బీసీసీఐగ్రేట్ అని కామెంట్ చేశారు. 


ఇక  ఇంతకుముందు కూడా  ఇదే విషయంలో పలు సార్లు రవిశాస్త్రి ట్రోల్స్ కు గురైయ్యాడు. కాగా  ఇటీవలే వరుసగా  రెండో సారి భారత టీం కు ప్రధాన కోచ్ గా ఎంపికైయ్యాడు రవిశాస్త్రి.  ఇంతకుముందు ఏడాదికి  7కోట్ల  వేతనం తీసుకున్నఅతను ఇప్పుడు 10కోట్లు  తీసుకుంటున్నాడు.  ఇదిలావుంటే ప్రస్తుతం జరుగుతున్న రాంచి టెస్ట్ తో మూడు టెస్టుల సిరీస్ ను  భారత్ క్లీన్ స్వీప్ చేయడం  ఖాయంగా కనిపిస్తుంది.  మూడో టెస్ట్ లో  మొదటి ఇన్నింగ్స్ లో  కేవలం 162 పరుగులకే అల్ ఔట్ అయ్యి ఫాలో ఆన్  కూడా తప్పించుకోలేకపోయిన ప్రొటీస్ జట్టు  సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా  అదే ప్రదర్శన ను కొనసాగిస్తుంది. మూడో రోజు ఆటముగిసే సమయానికి  సౌతాఫ్రికా  8వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది.  ఇన్నింగ్స్ తేడాతో ఓటమి చెందకుండా ఉండాలంటే ఆ జట్టు మరో 203 పరుగులు చేయాలి.. ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో అది దాదాపు అసాధ్యం కాబట్టి వరుసగా  రెండో సారి ఇన్నింగ్స్ ఓటమి తో  సౌతాఫ్రికా  భారత పర్యటనను ముగించనుంది . 

మరింత సమాచారం తెలుసుకోండి: