సౌత్ఆఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడం ద్వారా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో భారత్ టాప్ ప్లేస్ ను మరింత పదిలం చేసుకుంది. 240 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్ ఎంత టాప్ పొజిషన్లో ఉందంటే.. సెకండ్ ప్లేస్ లో ఉన్న దేశం మన దరిదాపుల్లో కూడా లేదు.


ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో 60 పాయింట్లతో శ్రీలంక సెంకడ్ ప్లేసులో ఉంది. అంటే ఫస్ట్ ప్లేస్ కూ సెకండ్ ప్లేస్ కూడా ఎంత తేడా ఉందో చూడండి.. 240 ఎక్కడ.. 60 పాయింట్లు ఎక్కడ.. ఇక న్యూజిలాండ్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్న ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఖాతాలో చెరో 56 పాయింట్లు ఉన్నాయి.


ఈ సిరీస్ విజయంతో భారత్ ఖాతాలో మరో 120 పాయింట్లు చేరాయి. ఇంతకు ముందు వెస్టిండీస్ తో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత్ మొత్తంగా ఇదే జోరు కొనసాగించి నవంబర్ 14 నుంచి బంగ్లాదేశ్ తో ఆరంభంకానున్న రెండు టెస్టుల సిరీస్ లో కూడా గెలుపొందాలని టీమిండియా ప్లాన్ చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: