వచ్చే నెలలో  బంగ్లాదేశ్ తో జరుగనున్న టీ 20 , టెస్ట్ సిరీస్ లకు భారత జట్టును  ప్రకటించింది సెలక్షన్ కమిటీ.  టెస్ట్ జట్టులో  మార్పులు లేనప్పటికీ  టీ 20 సిరీస్ లో మాత్రం కొన్ని మార్పులు జరిగాయి. అందులో భాగంగా టీ 20 సిరీస్ కు కోహ్లీ కి రెస్ట్ ఇవ్వడంతో  రోహిత్ శర్మ  కెప్టెన్ గావ్యవహరించనున్నాడు.  ఇక ఎప్పటినుండో  అవకాశం కోసం ఎదురుచూస్తున్న కేరళ ఆటగాడు సంజు శాంసన్ కు ఎట్టకేలకు పిలుపొచ్చింది.  అతని తో పాటు  ముంబై అల్ రౌండర్  శివమ్ దూబే  కూడా  టీ 20 సిరీస్ కు ఎంపికైయ్యాడు. శివమ్ దూబే  భారత్ తరపున అంతర్జాతీయ  క్రికెట్ కు ఎంపిక కావడం  ఇదే మొదటిసారి.  ఈసీజన్  విజయ్ హజారే ట్రోఫీ లో దూబే పరుగుల వరద పారించడం తో పొట్టి ఫార్మాట్  కు తొలిసారి అతన్ని ఎంపిక చేసారు.  వీరితో పాటు గత రెండు సిరీస్ లకు దూరమైన స్పిన్నర్  యుజ్వేంద్ర చాహల్  తిరిగి స్థానాన్ని దక్కించుకున్నాడు.  అయితే  యువ ఫాస్ట్ బౌలర్  నవదీప్ సైని కి  సెలక్టర్లు మొండి చేయి చూపించారు.  ఇక ఇటీవలే వెన్నుముక గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న  అల్ రౌండర్ హార్దిక్ పాండ్య  ఇంకా కోలుకోకపోవడంతో అతన్ని కూడా పరిగణలోకి తీసుకోలేదు. 

ఇదిలా ఉంటే కొద్దీ రోజుల క్రితం  సౌతాఫ్రికా తో జరిగిన చివరిటెస్ట్ లో అరంగేట్రం చేసి అదరగొట్టిన  బీహార్ బౌలర్ నదీమ్  కు సెలక్షన్ కమిటీ  హ్యాండ్ ఇచ్చింది.  కుల్దీప్  కోలుకోవడంతో బంగ్లాదేశ్ తో జరుగనున్న టెస్ట్  సిరీస్ లో  నదీమ్  చోటు దక్కించుకోలేకపోయాడు. నవంబర్ 3న జరిగే మొదటి  టీ 20 మ్యాచ్ తో భారత్ లో బంగ్లాదేశ్ పర్యటన మొదలు కానుంది.   


టీ 20 జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్),శిఖర్ ధావన్ , కేఎల్  రాహుల్ ,సంజు శాంసన్ , శ్రేయాస్ అయ్యర్ ,మనీష్ పాండే  , యుజ్వేంద్ర చాహల్ ,కృనాల్ పాండ్య , రాహుల్ చాహార్ , వాషింగ్టన్ సుందర్,  దీపక్ చాహర్ ,శార్దూల్  ఠాకూర్  , ఖలీల్ అహ్మద్, శివమ్ దూబే , రిషబ్ పంత్ 


టెస్ట్ జట్టు : కోహ్లీ (కెప్టెన్) , రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ , మయాంక్ అగర్వాల్  ,సాహా , పుజారా , హనుమ విహారి ,జడేజా ,అశ్విన్ , కుల్దీప్ యాదవ్ ,షమీ , ఇషాంత్ , ఉమేష్ యాదవ్ , శుభమాన్ గిల్ , రిషబ్ పంత్  


మరింత సమాచారం తెలుసుకోండి: