'బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ' అంటూ చిన్నతనం నుంచి ప్రతొక్కరికి బాగా గుర్తుండిపోయిన సచిన్ టెండూల్కర్ రికార్డుల రారాజు.. క్రికెట్ ప్రపంచంలోనే వంద శతకాల మార్క్‌ని అందుకున్న ఏకైక క్రికెటర్. పిన్న వయసులో భారత గడ్డ మీద క్రికెట్ ఆడేందుకు వచ్చిన టెండూల్కర్ కెరీర్‌ తొలినాళ్లలో సెలక్టర్ల నుంచి సచిన్‌కి చేదు అనుభవం ఎదురైందట. జట్టులోకి అతడ్ని ఎంపిక చేయని సెలక్టర్లు.. ఇంకా ఆటని మెరుగు పర్చుకోవాలని సూచించిన సంగతులు గుర్తు చేసుకొని సచినే స్వయంగా వెల్లడించాడు.


ఈ మధ్య ముంబయిలోని ఓ స్కూల్ విద్యార్థులతో మమేకమైన సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ ‘పదకొండేళ్ల ప్రాయంలో తన క్రికెట్ జర్నీ ప్రారంభమైందని, ఆ చిన్న వయసులో తన మదిలో ఉన్న ఏకైక గోల్ తాను పుట్టిన భారత గడ్డపై ఆడాలని., తన ఫస్ట్ సెలక్షన్స్ ట్రయల్స్‌ను గుర్తు చేసుకుంటూ భారత జట్టులో‌కి తనను మాత్రం ఎంపిక చేయకుండా పక్కన పెట్టిన సెలక్టర్ల తీరును వివరించాడు.


తనని ఎంపిక చెయ్యకుండా ఆటని ఇంకా మెరుగు పర్చుకోవాలని అప్పటి సెలెక్టర్లు సూచించారు, వాస్తవానికి అప్పటికి తాను చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నా కూడా సెలక్టర్లు అలా పక్కన పెట్టడంతో నిరాశకి గురైనట్టుగా చెప్పుకొచ్చారు. కానీ!! దాని తర్వాత తాను ఎంతగానో శ్రమించి ఆటని మరింత మెరుగుపర్చుకున్నారని., కేవలం తాను మాత్రమే కాదు ఏ వ్యక్తయినా సరే తమ కలని నెరవేర్చుకోవాలంటే కష్టపడాలి తప్ప.. అడ్డదారులు ఏమాత్రం సాయపడవు’ అంటూ విద్యార్థులకి సచిన్ టెండూల్కర్ ఉపదేశించాడు.

భారత్ తరఫున 24 ఏళ్లపాటు క్రికెట్ ఆడిన సచిన్ టెండూల్కర్ 200 టెస్టులు, 463 వన్డేలు ఆడిన సంగతి మనకు తెలిసిందే. టెస్టుల్లో 51 సెంచరీలు సాధించిన మాస్టర్.. వన్డేల్లోనూ 49 శతకాలు సాధించాడు. మొత్తంగా.. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 శతకాల మార్క్‌ని అందుకున్న ఏకైక క్రికెటర్‌గా చరిత్రలో నిలిచాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: