టీమిండియా  డాషింగ్  ఓపెనర్  వీరేంద్ర సెహ్వాగ్  జట్టులోకి వచ్చిన  కొత్త లో  మిడిల్ ఆర్డర్ లో  బ్యాటింగ్ కు వచ్చేవాడు. అయితే   2001 లో  శ్రీలంక   తో జరిగిన  ట్రై సిరీస్  కు  మాస్టర్ బ్లాస్టర్  సచిన్  దూరం కావడం తో  సెహ్వాగ్  ఓపెనర్ గా వచ్చి  క్లిక్ అయ్యాడు.  ఈ సిరీస్ లో న్యూజిలాండ్ తో జరిగిన  మ్యాచ్ లో  కేవలం 69బంతుల్లోనే సెంచరీ చేసి  ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన   మూడో బ్యాట్స్ మెన్ గా అతను  గుర్తింపు పొందాడు. ఇక అప్పటినుండి  సెహ్వాగ్ వెనుదిరిగి చూసుకోలేదు. 


అయితే  తాను  ఓపెనర్ గా రావడానికీ  ఇప్పుడు ఈ స్థాయిలో ఉండడానికి  బీసీసీఐ నూతన అధ్యక్షుడు  , మాజీ సారథి సౌరవ్  గంగూలీ నే   కారణం అని  అన్నాడు సెహ్వాగ్.  నేను మిడిల్ ఆర్డర్ లో  బ్యాటింగ్ చేస్తున్న రోజుల్లో  దాదా నా దగ్గరికి  వచ్చి ఓపెనింగ్ చేయమన్నాడు.  ఒక వేళా  ఓపెనర్ గా ఫెయిల్ అయినా మిడిల్ ఆర్డర్ లో నీ స్థానానికి  ఎలాంటి డోకా ఉండదు. ఓ నాలుగుఇన్నింగ్స్  ల్లో ఓపెనర్ గా రమ్మని గంగూలీ సూచించాడు. అతను అలా  గుర్తించకపోయే ఉంటే క్రికెట్ ప్రపంచ లో సెహ్వాగ్  ఎవరో  ఎవరికి  తెలిసేది కాదని   తాను క్రికెట్ లో రాణించడం లో  దాదా పాత్ర మరువలేనిదని ఈ సందర్భంగా సెహ్వాగ్  గుర్తుచేసుకున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: