నాచ్ బాలియో తొమ్మిదవ సీజన్ లో సెర్బియన్ నటి నటాషా స్టాన్ కోవిచ్ జంటను గెలిపించేందుకు భారత క్రికెట్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా  రంగం లోకి దిగాడు .  నటాషా స్టాన్ కోవిచ్ , తన మాజీ ప్రియుడు అలీ కలిసి నాచ్ బాలియో లో పాల్గొంటుంది . ఇప్పుడు ఆ జంట గెలవాలంటే అభిమానుల ఓట్లు ఎంతో కీలకం కావడంతో , నటాషా స్టాన్ కోవిచ్ కు ఓట్లు వేసి గెలిపించాలని హార్దిక్ పాండ్యా అభిమానులను కోరాడు . ఈ మేరకు తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ నటాషా ను గెలిపించాలని కోరుతూ చేసిన పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది .


 హార్దిక్ పాండ్యా నటాషా కు మద్దతుగా రంగం లో దిగడం తో నాచ్ బాలియో తొమ్మిదవ సీజన్ లో ఆమె గెలుపు ఖాయమేనన్న వాదనలు విన్పిస్తున్నాయి . గత కొంతకాలంగా హార్దిక్ పాండ్యా , నటాషా లు ప్రేమ లో ఉన్నట్లు తెలుస్తోంది . ఇద్దరు కలిసి పార్టీలకు , పబ్ లకు తిరుగుతున్నారని సమాచారం . దానికి తోడు హార్దిక్ సోదరుడు కృనల్ పాండ్యా , అతడి సతీమణి పాంఖురి లు ఏర్పాటు చేసిన   దీపావళి వేడుకలకు కూడా నటాషా హాజరైంది . పాండ్యా తల్లిదండ్రులు కూడా నటాషా , హార్దిక్ ప్రేమాయణాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది .


 త్వరలోనే వీరిద్దరూ పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు సమాచారం . హార్దిక్ కు ఇటీవల గాయమై  వెన్నుముక కు శస్త్ర చికిత్స జరగ్గా, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు . శస్త్ర చికిత్స జరిగిన తరువాత చక్రాల కుర్చీ ద్వారా  నడుస్తున్న హార్దిక్ , తన ప్రియరాలి కోసం సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉన్నాడు .


మరింత సమాచారం తెలుసుకోండి: