వచ్చే నెల 3న  ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ  స్టేడియంలో భారత్ -బంగ్లాదేశ్ జట్ల మధ్య  మొదటి టీ 20 మ్యాచ్ జరగాల్సి వుంది. అయితే  ఈ మ్యాచ్ వేదిక మారే అవకాశం  ఉందని సమాచారం.  దీపావళి  తరువాత ప్రస్తుతం ఢిల్లీ లో గాలి కాలుష్యం  తార స్థాయికి చేరుకుంది. దాంతో పర్యావరణ పరిరక్షకులు  నూతన  బీసీసీఐ అధక్షుడు  సౌరవ్ గంగూలీ కి వేదిక ను మార్చుకోవాలంటూ ఓ లేఖ రాశారు.  ప్రస్తుతం ఢిల్లీ లో గాలి కాలుష్యం  ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దాంతో  అక్కడి   ప్రజలు తీవ్ర  ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో  అక్కడ  క్రికెట్ ఆడితే   క్రికెటర్లు కూడా  అనారోగ్య సమస్యల భారిన పడే అవకాశాలు వున్నాయి. అందువల్ల  మొదటి టీ 20కి  వేరే వేదికను చూసుకోవాలని  వారు లేఖలో పేర్కొన్నారు. 



అయితే దీనిపై గంగూలీ  కి  ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని తెలుస్తుంది.  మరి క్రికెటర్ల  ఆరోగ్యాన్ని ద్రుష్టి లో పెట్టుకొని మ్యాచ్ ను వేరే  చోటికి తరలిస్తారో లేదో  షెడ్యూల్ ప్రకారం అదే  వేదిక పై ఆడిస్తారో చూడాలి. ఇక గతంలో భారత పర్యటనకు వచ్చిన  శ్రీలంక ఆటగాళ్లు  ఢిల్లీ టెస్ట్ సందర్బంగా  తీవ్ర  ఇబ్బందులు  పడ్డారు. గాలి కాలుష్యం వల్ల  మాస్క్ లు ధరించి మరీ   మైదానం లోకి దిగారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: