కోహ్లీ భార్య అనుష్క శర్మనకి  టి కప్పు వివాదంపై  ఫరూక్ ఇంజనీర్ క్షమాపణలు కోరారు,అస్సలు విషయానికి వస్తే  బిసిసిఐ సెలెక్టర్ లలో ఒకరు  కోహ్లీ భార్య అనుష్క శర్మకి టి కప్పు అందించారని  మాజీ క్రికెటర్ ఫరూక్ ఇంజనీర్ విమర్శలు చేసిన వాక్యాలు క్రికెట్ వర్గాలలో చర్చనియాంశంగా మారాయి, నిజానికి మాజీ క్రికెటర్ ఫరూక్  ఇంజనీర్ ఏమన్నారు అంటే "వరల్డ్ కప్ జరిగేటప్పుడు ఒకరు టీమిండియా బ్లేజర్ వేసుకొని  అనుష్క శర్మ కి టీ  అందించారు .


అతనిని ఎవరు అని అడిగితే నేను టీమిండియా సెలెక్టర్ అని చెప్పాడు"  అని ఫరూక్ ఇంజనీర్ వివరించాడు.దీనిపై  అనుష్క శర్మ  అభిమానులు మరియు బిసిసిఐ సెలెక్టర్లు పెద్ద ఎత్తున విమర్శలు చేసారు ,దింతో అనుష్కశర్మ ఘాటుగా  స్పందించారు. "భారత్ క్రికెటర్ సెలక్షన్ కమిటీ పై మీరు వ్యాఖ్యలు చేయదలుచుకుంటే చేసుకోండి .అంతే తప్ప మీ వాదనలకు సంచలనం జోడించుకోవడానికి నా పేరును  ప్రస్తావించకండి " అంటూ ఫరూక్ ఇంజనీర్ కు హితవు పలికారు .


"మీ స్వార్థ  ప్రయోజనాల కోసం  నా పేరును ఉపయోగించుకుంటే నేను సహించను" అని  అనుష్క శర్మ స్పష్టం చేసారు. "అయినా సెలెక్టర్లు నాకు టి అందించారు అనడం లో ఎంత మాత్రం  నిజం లేదు ,వరల్డ్ కప్ జరిగేయిటపుడు  నేను కేవలం ఒక్క మ్యాచ్ కి మాత్రమే హాజరైయ్యాను . అది కూడా ఫ్యామిలీ బాక్స్ లో కూర్చొని చూశాను సెలెక్టర్ల బాక్స్ లలో కాదు అంటూ అనుష్క శర్మ  వివరణ ఇచ్చారు. 


దీనిపై  భారత్ క్రికెటర్ సెలక్షన్ కమిటీ లో పెద్ద ఎత్తున చర్చ జరగడంతోను ,అనుష్క శర్మ ఘాటు  రిప్లై ఇవ్వడంతోను వెంటనే మాజీ క్రికెటర్ ఫరూక్ ఇంజనీర్ క్షమాపణ కోరారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: