ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని పొట్టి క్రికెట్ ఓ ఊపు ఊపేస్తోంది. ప‌లు చిన్న దేశాలు సైతం ఈ ఫార్మాట్‌లో ఎన్నో రికార్డులు, మ‌రోన్నో సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తున్నాయి. ఇక వ‌చ్చే యేడాది ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రిగే టీ 20 ప్ర‌పంచ‌క‌ప్ క్రికెట్ టోర్న‌మెంట్లో ఏకంగా 16 దేశాలు పాల్గొన‌నున్నాయి. క్రికెట్ ప‌రిధిని విశ్వ‌వ్యాప్తం చేసేందుకు ఎక్కువ దేశాల‌కు ఈ క‌ప్‌లో ఛాన్స్ ఇచ్చింది.


ఇదిలా ఉంటే టీ-20 ఫార్మాట్లో 5వ ర్యాంకర్ భారత్, 9వ ర్యాంకర్ బంగ్లాదేశ్ జట్ల మధ్య ఈరోజు న్యూఢిల్లీ వేదికగా జరిగే తొలి టీ-20మ్యాచ్ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ్యాచ్ అంత‌ర్జాతీయ టీ 20 క్రికెట్ చ‌రిత్ర‌లో స‌రికొత్త రికార్డుల‌కు వేదిక కానుంది. ధూమ్ ధామ్ టీ-20 చరిత్రలో 1000వ మ్యాచ్ గా నమోదుకానుంది. అంటే టీ 20 క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభ‌మయ్యాక ఇప్ప‌టికే 999 మ్యాచ్‌లు జ‌ర‌గ‌గా ఇది 1000వ మ్యాచ్ కావ‌డం విశేషం.


అలాగే వాయుకాలుష్య వాతావరణంలో జరుగుతున్న తొలి టీ-20 మ్యాచ్ గా కూడా చరిత్రలో నిలిచిపోనుంది.దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఏ రేంజ్‌లో వాయు కాలుష్యం ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక టీ-20 ఫార్మాట్లో ఇప్పటి వరకూ భారత్ తో ఎనిమిదిసార్లు మాత్రమే తలపడిన బంగ్లాదేశ్…ఎనిమిదికి ఎనిమిదిసార్లూ పరాజయాలు పొందటం విశేషం.


ఈ క్ర‌మంలోనే న్యూ ఢిల్లీలోని ఫిరోజ్ షా (మొఘ‌ల్ చ‌క్ర‌వ‌ర్తి నిర్మించ‌డంతో ఆ పేరు వ‌చ్చింది ) కోట్లా స్టేడియాన్ని …కేంద్ర మాజీమంత్రి అరుణ్ జైట్లీ స్టేడియంగా మార్చిన తరువాత జరుగుతున్న మొట్టమొదటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఇదే కావటం మరో విశేషం. అయితే పిచ్‌కు మాత్రం పిరోజ్ షా కోట్లా పిచ్‌గానే పేరు ఉంచారు.


మరింత సమాచారం తెలుసుకోండి: