ఎంతటి విషయమైన సరే  కన్విన్స్  చేసే సామర్థ్యం ఒక్క బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ కి మాత్రమే ఉందని చెపువచ్చు, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని ఒక టెస్ట్ మ్యాచ్ కోసం ఒప్పించడం జరిగింది.అస్సలు విషయానికి వస్తే డే అండ్‌ నైట్‌ టెస్టు కోసం టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని మూడు నిమిషాల్లోనే ఒప్పించాడట  బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ. 

ఈ విషయాన్ని దాదానే స్వయంగా తెలిపాడు. కొన్నేళ్లుగా గులాబీ టెస్టు విషయంలో వెనుకంజ వేస్తున్న భారత జట్టును..  బోర్డు కొత్త బాస్‌గా వచ్చిన వారం రోజుల వ్యవధిలోనే ఒప్పించేశాడు. 


బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ "గతంలో ఏం జరిగిందో నాకు అవసరం లేదు , ఇప్పటిదాకా భారత్‌ ఈ తరహా మ్యాచ్‌లు ఎందుకు ఆడలేదో నిజంగా నాకు తెలీదు. అలాగే అడిలైడ్‌లో కూడా ఎందుకు అంగీకరించలేదో నాకైతే అవగాహన లేదు" అని వివరించాడు .దీని కోసం కోహ్లితో గంట పాటు సమావేశమయ్యా.కోహ్లీని  తొలి ప్రశ్నగా డే అండ్‌ నైట్‌ గురించే అడిగాను.

అందుకు కోహ్లీ  కేవలం మూడు సెకన్లలోనే సమాధానమిస్తూ సంతోషంగా ముందుకెళదాం అన్నాడు. ఎందుకంటే ఖాళీ స్టాండ్స్‌ మధ్య టెస్టులు ఆడిస్తే లాభం లేదనే విషయాన్ని అతడు కూడా గ్రహించాడు. ఇప్పుడు ప్రజలు ఆఫీస్‌లు వదిలి మ్యాచ్‌లకు వచ్చే పరిస్థితి ఏ మాత్రం లేదు’ అని గంగూలీ తెలిపాడు. ఈనెల 22 నుంచి ఈడెన్‌లో రెండో టెస్టును ఫ్లడ్‌లైట్ల వెలుతురులో నిర్వహించనున్నారు.

ఈ  విధంగా సౌరవ్‌ గంగూలీ కోహ్లీని అతి తక్కువ సమయం లోనే ఒప్పించడం గొప్ప విషయమే ,దీంతో భారత్ లో ఈ  విదమైన టెస్ట్ మ్యాచ్ జరగడం మొదటి సారి దీనిపై  అభిమానులంతా చాల ఆసక్తికరంగా టెస్ట్ మ్యాచ్ కోసం ఎదురుచుస్తునారు.


మరింత సమాచారం తెలుసుకోండి: