పాక్ క్రికెట్లో 2011లో చోటుచేసుకున్న మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంపై రావల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీని గురించి షోయబ్ అక్తర్ ఒక టివి షోలో కూడా మాట్లాడారు . విషయానికి వస్తే  షోయబ్ అక్తర్ ‘రివైండ్ విత్ సమీనా పీర్జాదా’ అనే టీవీ టాక్ షోలో మాట్లాడుతూ. అప్పట్లో తాను ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో పాటు తన జట్టులోని ప్రత్యర్థులతో కూడా కలిసి ఆడానని చెప్పాడు.


‘నా దేశాన్ని మోసం చేయకూడదని నేను విశ్వసించేవాడిని,  నేనెప్పుడూ ఫిక్సింగ్ కు పాల్పడలేదు కానీ, నా చుట్టూ మ్యాచ్ ఫిక్సర్లే ఉండేవారు. నేను 21 మంది ప్రత్యర్థులతో క్రికెట్ ఆడేవాడిని, వారిలో 11మంది విదేశీ క్రికెటర్లు, 10 మంది మా వాళ్లు.  మ్యాచ్ ఫిక్సర్లు ఎవరో  అస్సలు మాకు తెలియదు, కాని మొత్తం మ్యాచ్ లన్నీ బుకీలు ఫిక్సింగ్ చేసినట్లు ఫిక్సింగ్ కు పాల్పడిన మహ్మద్ ఆసిఫ్ నాతో చెప్పాడు’ అని పేర్కొన్నాడు.


ఈ ఫిక్సింగ్ వివాదం తనను  ఎంతగానో తీవ్రంగా కలిచివేసిందని, కోపం కూడా వచ్చిందని అన్నాడు. తట్టుకోలేక గోడకు పంచ్ లు కూడా విసిరానని చెప్పాడు. మరొక విషయాన్ని  కూడా పంచుకున్నాడు .అదేమిటంటేయ్ ఆమిర్, ఆసిఫ్ లు తమ టాలెంట్ ను వృథా చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

మ్యాచ్ ఫిక్సింగ్ లో దొరికిపోయిన పేసర్ మహ్మద్ ఆమిర్, మహ్మద్ ఆసిఫ్‌లు ఐదేళ్లపాటు నిషేధానికి గురికాగా, స్పాట్ ఫిక్సింగ్‌లో దొరికిపోయిన ఓపెనర్ సల్మాన్ బట్ కూడా ఐదేళ్ల పాటు నిషేధానికి గురయ్యాడు. నిషేధానంతరం ఆమిర్ మళ్లీ పాక్ జట్టులోకి  వచ్చినప్పటికి ఆశ్చర్యకరంగా ప్రపంచకప్ తర్వాత, ఈ ఏడాది జూలై లో తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆసిఫ్, సల్మాన్ బట్ లకు ఆడే అవకాశం రాలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: