ఇటీవల  సౌతాఫ్రికా తో జరిగిన  టెస్టు  సిరీస్ లో  ఓపెనర్ గా వచ్చి  పలు రికార్డులు   సృష్టించిన   టీమిండియా ఓపెనర్  రోహిత్ శర్మ  .. తాజాగా పొట్టి ఫార్మాట్ లో   రెండు రికార్డుల పై   కన్నేశాడు.   ఆదివారం ఢిల్లీ వేదికగా  భారత్  - బంగ్లాదేశ్  జట్ల మధ్య మొదటి  టీ 20 మ్యాచ్ జరుగనుంది..  ఈ సిరీస్ కు   రెగ్యులర్  కెప్టెన్  విరాట్ కోహ్లీ  కి విశ్రాంతి  నివ్వడంతో రోహిత్  కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.  ఈ నేపథ్యం లో  కోహ్లీ  రికార్డులను దాటే అవకాశం  రోహిత్ కు వచ్చింది. 




ఈ సిరీస్ లో కనుక  రోహిత్ మరో ఎనమిది పరుగులు చేస్తే  చాలు  అంతర్జాతీయ టీ 20 ల్లో అత్యధిక పరుగులు చేసిన  మొదటి ఆటగాడిగా  రికార్డు సృష్టించనున్నాడు.  ప్రస్తుతం కోహ్లీ 2450 పరుగుల తో ఈజాబితాలో  మొదటి ష్ఠానంలో  వున్నాడు.  తాజాగా ఢిల్లీ టీ20 తో రోహిత్  ఈ రికార్డు ను బ్రేక్ చేసే అవకాశాలు  ఎక్కువగా వున్నాయి.  అలాగే  కోహ్లీ ఇప్పటివరకు  22హాఫ్ సెంచరీలుచేసి టీ 20 ల్లో  అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా మొదటి స్థానంలో ఉండగా  రోహిత్  ఇప్పటివరకు  21 సార్లు  50కి పైగా పరుగులు చేసి  రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇందులో నాలుగు సెంచరీలు , 17 హాఫ్ సెంచరీలు  వున్నాయి. ఇక  బంగ్లా తో సిరీస్ లో  ఒక్క హాఫ్ సెంచరీ చేస్తే  రోహిత్, కోహ్లీ సరసన నిలుస్తాడు.  మరి  రోహిత్ ఈ రికార్డులను అందుకుంటాడో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: