క్రికెట్‌ను సరికొత్త పుంతలు తొక్కించే క్రమంలో ఇప్పటికే అనేక ప్రయోగాలు చేయగా ,భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ)   తాజాగా మరో సరికొత్త ప్రయోగానికి నాంది పలకడానికి సిద్దమైంది.  పవర్‌ ప్లేయర్‌ అనే ప్రయోగాన్ని క్యాష్‌ రిచ్‌ లీగ్‌ అయిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో  చేసేందుకు కసరత్తులు చేస్తోంది.   జట్టు అవసరాల్ని బట్టి ఒక ఆటగాడ్ని ఏ దశలోనైనా సబ్‌స్టిట్యూట్‌గా ఉపయోగించే విధంగా సరి కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

అదే సమయంలో బీసీసీఐ తుది జట్టును ప్రకటించే ముందు 11 మందికి బదులు 15మందికి పెంచాలనే యోచనలో  ఉంది.దీని పరంగా తుది జట్టులో ఆడేది 11 మందే అయినా, మిగతా నలుగుర్ని సబ్‌స్టిట్యూట్‌లగా ఉపయోగించుకోవచ్చు. దీని వలన బీసీసీఐ ఎలా వుంది అంతేకాకుండా  ఒక ఆటగాడి స్థానంలో మరొక ఆటగాడ్ని దింపడానికి వెసులుబాటు కుదురుతుందనేది వారి ఆలోచన .


 దీనిపై బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘ వచ్చే ఐపీఎల్‌లో తుది జట్టును 11 మందితో కాకుండా 15 మందితో కూడిన జట్టును సిద్ధం చేసుకునే దానిపై కసరత్తులు చేస్తున్నాం. ఈ కొత్త  విధానంకు ఆమోద ముద్ర పడితే 15 మందితో జట్టును ప్రకటించుకోవచ్చు.

ఒక ప్లేయర్‌ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగొచ్చు. వికెట్‌ పడిన సమయమా, చివరి ఓవరా అనేది కాకుండా ఏ సమయంలోనే అతడ్ని జట్టు అవసరాలకు తగ్గుట్టు  వినియోగించుకోవచ్చు. ఇది వచ్చే ఏడాది జరుగనున్న ఐపీఎల్‌ నాటికి సిద్ధం చేయడానికి చూస్తున్నాం.సదరు అధికారి  దీన్ని మొదటిగ దేశవాళీ లీగ్‌ అయిన ముస్తాక్‌ అలీ ట్రోఫీలో పరిశీలించాలనుకుంటున్నాం అని తెలిపారు .


మరింత సమాచారం తెలుసుకోండి: