ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ కోహ్లీ ఈ రోజు తన ౩౧ వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా కోహ్లీ తన గురించి తాను ఒక లేఖ రాసుకున్నాడు. ఆ లేఖ చాలా భావోద్వేగపూరితంగా ఉంది. దానిలో ఇలా ఉంది. హాయ్ చీకూ ముందుగా నీకు జన్మదిన శుభాకాంక్షలు. నాకు తెలుసు నీ భవిష్యత్తు కోసం నీకు చాలా ప్రశ్నలున్నాయని. కానీ వాటన్నింటికి నేను సమాధానం చెప్పబోవట్లేదు. ఎందుకంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలియనపుడు సమాధానం ఎలా చెప్పాలి. 


ఈ రోజు గురించి బాధపడకు, గమ్యాన్ని గురించి అస్సలు ఆలోచించచకు..ప్రయాణమే ముఖ్యం...ఇక ఆ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది. నేను నీకు చెప్పేది ఏంటంటే, జీవితం తనలో ఎన్నింటినో దాచుకుంటుంది. మనం చేయాల్సిందల్లా మన దారిలో కనిపిస్తున్న అవకాశాల కోసం వెయిట్ చేస్తూ సిద్ధంగా ఉండడమే. ఎప్పుడైతే ఆ అవకాశం వస్తుందో అప్పుడు దాన్ని పట్టుకోవాలి..ఏదేమైనా ముందుకు సాగడం మర్చిపోనని గుర్తుపెట్టుకో. 


ఒకవేళ మొదటి సారి ఫెయిల్ అయినా మళ్ళీ ప్రయత్నించు. నిన్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నట్టే ఇష్టపడని వాళ్ళు కూడా ఉన్నారు. నీ గురించి తెలియకుండా నిన్నిష్టపడని వాళ్ల గురించి నువ్వు పట్టించుకోకు. నీపై నువ్వు నమ్మకం ఉంచుకో... నాకు తెలుసు..నువ్వు నాన్న గిఫ్ట్ ఇస్తాడనుకున్న షూస్ గురించి ఆలోచిస్తున్నావని, కానీ  ఆయన నాకిచ్చిన కౌగిలింత ముందు ఆ గిఫ్ట్ చాలా చిన్నది. అదే కాదు ఆయన నా హైట్ మీద పేల్చిన జోక్ కూడా నాకు నచ్చింది. 


నాన్న కొన్ని సార్లు స్ట్రిక్ట్ గా ఉంతారని తెలుసు. కానీ అది నా నుండి బెస్ట్ ని పొందడానికే అని అర్థం చేసుకున్నాను. కొన్నిసార్లు మన  పేరెంట్స్ మనల్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవచ్చు. కానీ మనల్ని అత్యంత ప్రేమించేది వాళ్ళేనని గుర్తుపెట్టుకో..నువ్వు వాళ్ళని ప్రేమించు. గౌరవించు, వాళ్లతో ఎక్కువ సమయాన్ని గడుపు. నాన్నతో చెప్పు నువ్వంటే నాకిష్టమని...ఈ రోజు  చెప్పు. రేపు కూడా చెప్పు..ఇలా తరచుగా చెప్తూ ఉండు. 


చివరగా నీ మనసును అనుసరించు. నీ కలల వెంట పరుగులెత్తు.. అందరి పట్ల దయతో ఉండు. కలలు కంటేనే గొప్ప వాళ్లం అవుతామని  ప్రపంచానికి తెలియజెప్పు... నీలా నువ్వుండు అని కోహ్లీ తనకు తానే లేఖ రాసుకున్నాడు



మరింత సమాచారం తెలుసుకోండి: