క్రికెట్ లో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గెలిచే అవకాశం ఉన్న మ్యాచ్ ఓడిన సందర్భలు, ఓడే అవకాశం ఉన్న గెలుచే మ్యాచులను చాలా చూశాం. ట్వంటీ ట్వంటీ లు వచ్చాక ఇలాంటివి మరీ ఎక్కువగా జరుగుతాయి. పరుగుల వరద పారే ట్వంటీ ట్వంటీల్లో వికెట్లు పడిపోవడం అంత సులువు కాదు. అయితే ఈ రోజు ఒక అద్భుతం జరిగిందనే చెప్పాలి.
  
నెల్సన్ వేదికగా న్యూజిలాండ్ లో ఈరోజు ఇంగ్లాండ, న్యూజిలాండ్ ల మధ్య ట్వంటీ ట్వంటీ మ్యాచ్ జరిగింది. మొత్తం ఐదు మ్యాచుల సిరీస్ లలో భాగంగా ఈ రోజు మూడవ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఓడిపోయింది. న్యూజిలాండ్ విధించిన 181  పరుగుల లక్ష్య చేధనలో చతికిల పడి చేజేతులా విజయాన్ని మిస్ చేసుకుంది. న్యూజిలాండ్ బ్యాటర్లలో మార్టిన్‌ గప్టిల్‌(33), గ్రాండ్‌హోమ్‌(55), రాస్‌ టేలర్‌(27), జేమ్స్‌ నీషమ్‌(20), సాంత్నార్‌(15) పరుగులు చేయడంతో న్యూజిలాండ్ నిర్ణీత ఇరవై ఓవర్లలో 180 పరుగులు చేయగలిగింది. 



ఈ పరుగులని చేధించే క్రమంలో ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ తమదైన ఆట తీరుని ప్రదర్శించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో డేవిడ్‌ మలాన్‌(55; 34 బంతుల్లో), జేమ్స్‌ విన్సే(49; 39 బంతుల్లో) పరుగులు చేసి ఆకట్టుకున్నారు. దీంతో స్కోరు 15 ఓవర్లలో 139 పరుగులు చేయగలిగారు. ఈ ఓవర్ లో మూడవ వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్, ఆ తర్వాత పది పరుగుల వ్యవధిలో జేమ్స్ విన్స్, ఇయాన్‌ మోర్గాన్‌(18), సామ్‌ బిల్లింగ్స్‌(1), సామ్‌ కరాన్‌(2), లూయిస్‌ గ్రెగరీ(0)ల రూపంలో ఐదు వికెట్లను కోల్పోయింది. 


దీంతో ఇంగ్లండ్ పై తీవ్ర ఒత్తిడి పడింది. దీంతో నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ౧౬౬ పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో న్యూజిలాండ్ ఐదు మ్యాచ్ ల సిరీస్ లో రెండు మ్యాచ్ లు గెలిచి ఆధిక్యంలో నిలిచింది.


మరింత సమాచారం తెలుసుకోండి: