భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ గత కొన్ని రోజులుగా వార్తల్లో ఉంటూ వస్తున్నాడు. ధోనీ స్థానంలో వచ్చిన పంత్ ఆట ధోనీలా ఉండట్లేదని అంటున్నారు. క్రికెట్ అభిమానించే వారే కాదు సీనియర్ ఆటగాళ్లయిన గౌతమ్ గంభీర్ లాంటి వాళ్ళు కూడా పంత్ ఆట తీరు మార్చుకోవాలని సూచించారు. అతని ఆట తీరును విమర్శిస్తున్న వారికి పంత్ మరొసారి దొరికిపోయాడు. గురువారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో పంత్ దుడుకుతనం వల్ల తప్పు జరిగింది. 


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇండియాని మొదటి ఐదు ఓవర్ల వరకు బంగ్లాదేశ్ ఒక ఆట ఆడుకుందనే చెప్పాలి. ఓపెనర్లు నయీమ్, లిటన్ దాస్ మం చి జోరు మీద ఉన్నారు. అయితే ఆరవ ఓవర్లో చాహల్ వేసిన బంతికి లిటన్ దాస్ క్రీజులో నుండి ముందుకు వచ్చి ఆడాడు. దాంతో బంతి అతని బ్యాటుని తగలకుండా కీపర్ అయిన పంత్ చేతిలోకి వెళ్ళడంతో స్టంప్ ఔట్ చేశాడు. అప్పటికి ఒక వికెట్ పడిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 


కానీ అంతలోనే అది నాటౌట్ గా తేలడంతో షాకయ్యారు. అసలేం జరిగిందంటే, లిటన్ బ్యాట్ ని తగలకుండా వెళ్ళిన బంతిని వికెట్ల కంటే ముందే పట్టుకుని స్టంప్ చేయడం వల్ల దాన్ని నో బాల్ గా ప్రకటించారు. పదమూడవ ఓవర్లో కూడా పంత్ మరోసారి అదే తప్పు చేసినట్టు అంపైర్లు ప్రకటించారు. మళ్ళీ ఆ నిర్ణయాన్ని సరిచేసి ఔట్ గా ప్రకటించారు. ఇదంతా పంత్ దుడుకుతనం వల్లే జరిగింది. ఐసీసీ నిబంధనల ప్రకారం బంతి వికెట్స్ దాటిన తర్వాత కీపర్ చేతిలోకి వెళ్ళాలి. 


లేదంటే దాన్ని నో బాల్ గా ప్రకటిస్తారు. ఇలా అనవసరంగా విమర్శల పాలవడం మంచిది కాదని సూస్చిస్తున్నారు. మరి ఇకనైనా పంత్ తన ఆట తీరును మార్చుకుని  మంచి ఆటగాడిగా కొనసాగుతాడా లేదా చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: