టీమిండియా టి20ల్లో ప్రపంచ రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియా పేరిట ఉన్న వరల్డ్‌ రికార్డును బ్రేక్‌ చేసింది.  గురువారం జరిగిన రెండో టి20 మ్యాచ్‌లోబంగ్లాదేశ్‌తో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధిచింది. పొట్టి ఫార్మాట్‌ ఛేజింగ్‌లో భారత జట్టుకు ఇది 41వ విజయం కావడం విశేషం. ఇప్పటికి 61వ సార్లు టీమిండియా ఛేజింగ్‌కు దిగగా 41 పర్యాయాలు ఘన  విజయాల్ని అందుకుంది.

40 విజయాలతో ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉంది. అయితే  69 సార్లు సెకండ్‌ బ్యాటింగ్‌ దిగి 40 సార్లు ఆసీస్‌ గెలిచింది. అంటే దీని అర్థం టీమిండియా ఆస్ట్రేలియా కంటే తక్కువ మ్యాచ్‌ల్లోనే  ఛేజింగ్‌ రికార్డును చేజిక్కించుకుంది.


రోహిత్‌ శర్మ టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌  ఆయన  పలు రికార్డులు బ్రేక్‌ చేశాడు. టి20ల్లో అత్యధిక సిక్సర్లు(37) సాధించిన కెప్టెన్‌గా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. ముందు వారితో పొలిస్తే మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని(34) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ధోని 62 ఇన్నింగ్స్‌లో ఈ రి​కార్డు సాధించగా,  కేవలం​ 17 ఇన్నింగ్స్‌లోనే రోహిత్‌ ఈ రికార్డును బ్రేక్‌ చేశాడు. 26 ఇన్నింగ్స్‌లో 26 సిక్సర్లతో విరాట్‌ కోహ్లి వీరి తర్వాత స్థానంలో ఉన్నాడు. అత్యధిక అర్ధ సెంచరీల రికార్డును సమం చేశాడు. విరాట్‌ కోహ్లితో  22వ అర్ధసెంచరీతో సమంగా నిలిచాడు. కెప్టెన్‌గా వీరిరువురూ ఆరు అర్థసెంచరీలు సాధించడం విశేషం.


శిఖర్‌ ధావన్‌తో కలిసి రోహిత్‌ శర్మ  టి20ల్లో వంద కంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రికార్డును  తన పేరిట లఖించుకున్నాడు. గతంలో కోహ్లితో కలిసి మూడు సార్లు వంద ప్లస్‌ పరుగుల భాగస్వామ్యాలు నమోదు చేసిన ‘హిట్‌మాన్‌’ తాజాగా శిఖర్‌ ధావన్‌తో కలిసి ఈ ఫీట్‌ను పునరావృతం చేశాడు. రాజ్‌కోట్‌ మ్యాచ్‌లో వీరిద్దరూ 118 పరుగుల భారీ ఓపెనింగ్‌ భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయానికి బాటలు వేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: