భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆట తీరుపై గత కొన్ని రోజులుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బంగ్లాదేశ్ తో జరిగిన టీ ట్వంటీ మ్యాచ్ లో కూడా అతను చాలా పొరపాట్లు చేశాడు. అత్యుత్సాహం ప్రదర్శించి అవుట్ అవ్వాల్సిన స్టంపౌట్ కాస్త నాటౌట్ గా మిగిలింది. అదీ గాక మొదటీ టీ ట్వంటీలో పంత్ ఏమరపాటు వల్ల ఇండియా డీఆర్ ఎస్ ని కోల్పోయింది. ఇన్ని తప్పులు చేస్తున్నప్పటీకీ అతనికి టీం ఇండియలో చోటు కల్పించడమే విచిత్రంగా ఉంది. 


క్రీడాభిమానులు అతని ఆట తీరుపై విమర్శలు చేస్తుంటే బీసీసీఐ అధ్యక్షుడైన గంగూలీ మాత్రం అతన్ని వెనకేసుకొస్తున్నాడు. గంగూలీ పంత్ గురించి మాట్లాడుతూ, అతను చాలా మంచి ఆటగాడు. ఆటలో ఇప్పుడిప్పుడే పరిణతి చెందుతున్నాడు.అతడికి కాస్త సమయం ఇవ్వండి. పంత్‌ ఒత్తిడిలో ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అందుకే అతడిపై ఎలాంటి ప్రెషర్‌ లేకుండా చూడాలి. పంత్‌​లో ఆపార ప్రతిభ దాగుంది అని చెప్పుకొచ్చాడు. 


ప్రపంచ కప్ ముగిసిన తర్వాతి నుండి పంత్ ఆట తీరు బాగాలేదని విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయినా కూడా అతనికి అవకాశాల మీద అవకాశాలు ఇస్తున్నారు. అదే స్థానంలో వేరే వారికి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది కదా అని అంటున్నారు. పంత్ పై అంత ప్రత్యేక శ్రద్ధ ఎందుకో ఎవరికీ అర్థం కావట్లేదు. ఎన్ని సార్లు విఫలమవుతున్నా మళ్ళీ మళ్లీ అవకాశాలు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. బంగ్లాదేశ్ తో జరిగిన మొదటి టీ ట్వంటీలో అటు బ్యాటింగ్ లోనూ, ఇటూ కీపింగ్ లోనూ పంత్ ఫెయిల్ అయ్యాడు.  


అయినా కూడా వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా పంత్ ని ఇంతలా వెనకేసుకు రావడం బాగాలేదని అంటున్నారు. మరి వచ్చే మ్యాచ్ లోనైనా అతడు మెరుగైన ప్రదర్శన ఇస్తాడేమో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: