క్రికెట్ లో ఒక్కోసారి ఆటగాళ్ళు బ్యాటుతోనే కాకుండా నోటికి కూడా పని చెప్తారు. అలా చేసి చివరికి సారీ చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. క్రికెట్ లో ఇలా తరచుగా జరుగుతుంటుంది. ఒక్కోసారి ఆటగాళ్ళను రెచ్చగొట్టడానికి ప్రత్యర్థి ఆటగాళ్ళు ఇలా చేస్తుంటారు. అంపైర్ నిర్ణయాలపై కూడా ఆటగాళ్ళు అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటిదే బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో జరిగింది.


బంగ్లాదేశ్ తో జరిగిన రెండవ టీ ట్వంటీలో రోహిత్ శర్మ తన అసహనాన్ని తిట్ల రూపంలో ప్రదర్శించి అడ్డంగా దొరికిపోయాడు. ఆ మ్యాచ్ లో రోహిత్ కొట్టిన బౌండరీల గురించి మాట్లాడుకున్నవారే అతను తిట్టిన తిట్ల గురించి కూడా మాట్లాడుకుంటున్నారు.రోహిత్ కి అంతలా కోపం ఎందుకు వచ్చిందనేది చూస్తే, పదమూడవ ఓవర్లో చాహల్ వేసిన బంతి సౌమ్య సర్కార్ స్టంప్ ఔట్ అయ్యాడు. అయితే అది ఔటా కాదా అన్న సందేహంతో ఫీల్డ్ అంపైర్ దాన్ని ధర్డ్ అంపైర్ కి ఇచ్చాడు. 


అయితే థర్డ్ అంపైర్ దాన్ని నాటౌట్ గా ప్రకటించాడు. అయితే అది ఔటే అని క్లియర్ గా తెలుస్తుంది.దాంతో రోహిత్‌ శర్మ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే తన నోటికి పని చెప్పాడు.ఫీల్డ్‌ అంపైర్‌ పక్కన ఉండగానే థర్డ్‌ అంపైర్‌ నిర్ణయం అసహనం వ్యక్తం చేశాడు. అదే సమయంలో  ఇదేమి అంపైరింగ్‌ అనే అర్థం వచ్చేలా అసభ్య పదజాలంతో దూషించాడు. చివరకూ ఫోర్త్‌ అంపైర్‌ అది ఔటేనని సౌమ్య సర్కార్‌ను ఒప్పించడంతో అతను డ్రెస్సింగ్‌ రూమ్‌కు చేరుకున్నాడు. 


ప్రస్తుతం రోహిత్ శర్మ తిట్ల దండకం చదివిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే రోహిత్ కిది కొత్తేమీ కాదు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో చతేశ్వర పుజారా పరుగుకి రాకపోవడంతో అతనిపై తిట్ల వర్షం కురిపించాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: