నాగపూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు టీ20ల సిరిస్‌లో దీపక్ చాహర్ మొత్తం 8 వికెట్లు తీశాడు. ఆ సిరీస్ లోనే మూడవ టీ20 లో వరుస వికెట్లను తీసి దీపక్ చాహర్ హ్యాట్రిక్ సాధించాడు. దీంతో అంతర్జాతీయ టీ20 విభాగంలో హ్యాట్రిక్ చేసిన తొలి భారత్ బౌలర్ గా రికార్డు సృష్టించాడు. మంగళవారం జరిగిన ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో భాగంగా విదర్భతో జరిగిన మ్యాచ్‌లో కూడా దీపక్ చాహర్ హ్యాట్రిక్ సాధించాడు. 


దాంతో టీ20 విభాగంలో వరస మ్యాచ్ల లో 2 హ్యాట్రిక్ లను సాధించిన తొలి భారత్ బౌలర్ గా రికార్డు సృష్టించాడు. ఇలాంటి అద్భుతమైన ప్రదర్శనతో యావత్ క్రికెట్ అభిమానుల చూపుని తన వైపు తిప్పుకున్నాడు ఈ యువ టీమిండియా బౌలర్ దీపక్ చాహర్. 


అయితే దీపక్ చాహర్ ప్రతిభను దాదాపు ఒక దశాబ్దం కిందటే భారత మాజీ ఓపెనర్ ఆకాశ్‌ చోప్రా గుర్తించాడు. కేవలం గుర్తించడమే కాదు భవిషత్తు చెప్పే ఒక స్వామిజిగా "ప్రతిభ ఉన్న యువ ఆటగాడిని చూశాను. అతడు రాజస్థాన్‌కు చెందిన దీపక్‌ చాహర్‌. అతడి పేరు గుర్తు పెట్టుకోండి. మీరు భవిష్యత్‌లో దీపక్‌ గొప్ప ప్రదర్శన గురించి చర్చించుకుంటారు" అని ట్వీట్ చేశాడు. 


2010వ సంవత్సరం చేసిన ఈ ట్వీట్ అక్షరాలా నిజమవ్వడంతో... ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆకాష్ చోప్రా 18 ఏళ్ల దీపక్ చాహర్ గురించి వేసిన కచ్చితమైన అంచనాను నెటిజన్లు బాగా కొనియాడుతున్నారు.
2018 లో క్రికెట్ లో అడుగుపెట్టిన 27 ఏళ్ల దీపక్ చాహర్ ప్రస్తుతం టీమిండియా లో చాలా ముఖ్యమైన బౌలర్ అయ్యాడు. జస్మిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ వంటి టాలెంటెడ్ బౌలర్లు గాయాల నుంచి కోలుకొని రీఎంట్రీ చేసిన.. దీపక్ చాహర్ ని మాత్రం టీమ్ నుంచి తీసేయడం మాత్రం కష్టం.


మరింత సమాచారం తెలుసుకోండి: