ఐపీల్ వేలానికి మరో నెలరోజులు సమయం ఉండడంతో ఫ్రాంఛైజీలకు ఆటగాళ్ళను మార్చుకునే  ట్రేడింగ్ పద్దతిని కల్పించింది. దాంతో ఒక టీమ్ లోని ఆటగాళ్ళు మరో టీమ్ ఆటగాళ్ళతో రీప్లేస్ అయ్యారు. అయితే ఈ మార్పుల్లో భాగంగా మారిన అతి ముఖ్యమైన ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్.  పంజాబ్ కెప్టెన్ అయిన అశ్విన్ డిల్లీ క్యాపిటల్స్ కి మారాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున 28 మ్యాచులాడిన అశ్విన్  25 వికెట్లు తీసాడు.


అంతే కాదు అటు బ్యాటింగ్ లోనూ తనదైన ప్రదర్శన కనబరిచాడు.అయినప్పటికీ పంజాబ్ అశ్విన్ ని వదులుకుంది. అజింక్యా రహానే కూడా రాజస్తాన్ రాయల్స్ నుండి ఢిల్లీకి మారాడు. రహానే ఇప్పటి వరకు రాజస్తాన్ కి వంద మ్యాచుల వరకి ఆడాడు. ఇద్దరు సీనియర్స్ రాకతో ఢిల్లీ మరింత బలపడనుంది. ఇప్పటి వరకు ఢిల్లీలో దాదాపు అందరూ యువ ఆటగాళ్ళే ఉన్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్ళు వస్తుండడంతో ఢిల్లో మరింత బలపడి మునుపటి కంటే మంచి ప్రదర్శనని ఇవ్వడానికి సిద్ధమవుతోంది.


ఇదిలా ఉంచితే మొత్తంగా ఎవరెవరు ఏ టీమ్ నుండి ఏ టీమ్ కి మారారో తెలుసుకుందాం.జగదీష్ సుచిత్ ఢిల్లీ నుండి పంజాబ్ కి, షెర్ఫాన్ రూథర్ ఫర్డ్, ట్ర్రెంట్ బౌల్ట్ లు ఇద్దరూ ఢిల్లీ నుండి ముంబై ఇండియన్స్ కి, అంకిత్ రాజ్ పుత్  పంజాబ్ నుండి రాజస్తాన్ కి, క్రిష్ణప్ప గౌతమ్ రాజస్తాన్ నుండి పంజాబ్ కి, ధావల్ కులకర్ణి  రాజస్తాన్ నుండి ముంబయికి రాహుల్ తివాటియా ఢిల్లీ నుండి రాజస్తాన్ కి మారారు.ఇక మయాంక్ మార్కాండే మొదటగా ముంబయి నుండి ఢిల్లీకి మారాడు. మళ్ళీ ఢిల్లీ నుండి రాజస్తాన్ రాయల్స్ లోకి వచ్చాడు. మొత్తానికి ట్రేడింగ్ లో భాగంగా ఈ ఆటగాళ్లందరినీ తమ ఫ్రాంఛైజీలు మార్చుకున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: