ఇండోర్ వేదికగా హోల్కర్ స్టేడియంలో బంగ్లాదేశ్ తో టెస్ట్ మ్యాచ్ జరుగుతున విషయం తెలిసిందే. రెండో రోజు ఆటలో భారత బ్యాట్స్ మెన్స్ ధాటికి బంగ్లా బౌలర్లు విలవిల లాడిపోయారు. ఈ మ్యాచ్ లో మయాంక్ అగర్వాల్ డబల్ సెంచరీ చేసి ఎన్నో రికార్డులు సృష్టించాడు. అతను ఈ మ్యాచ్ లో 243 పరుగులు చేశాడు. బంగ్లాపై భారత బ్యాట్స్ మెన్ చేసిన రెండవ అతి పెద్ద వ్యక్తిగత స్కోరు. 248 పరుగులతో మొదటి స్థానంలో సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. 


204 పరుగులతో రెండవ స్థానంలో ఉన్న కోహ్లీ మూడవ స్థానానికి వచ్చేశాడు. అంతే కాదు ఓపెనర్ గా వచ్చిన మయాంక్ అగర్వాల్ కు ఇది రెండో డబల్ సెంచరీ. ఓపెనర్ గా వచ్చి డబల్ సెంచరీ చేసిన వాళ్ళలో మయాంక్ మూడవ స్థానంలో ఉన్నాడు. ఆరు డబల్ సెంచరీలతో సెహ్వాగ్ మొదటి స్థానంలో ఉండగా, సునీల్ గవాస్కర్ మూడు డబల్ సెంచరీలతో రెండవ స్థానంలో ఉన్నాడు. ఇక మరో రికార్డుకొచ్చేసరికి, అతి తక్కువ ఇన్నింగ్సుల్లో రెండు వందల స్కోరును అందుకున్న ఆటగాడిగా రెండో స్థానంలోకి వచ్చాడు.

మయాంక్ అగర్వాల్ 12 ఇన్నింగ్సులాడి రెండు డబల్ సెంచరీలు చేసిన మూడవ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 5 ఇన్నింగ్సులాడి రెండు డబల్ సెంచరీలు చేసిన వాడిగా మొదటి స్థానంలో వినోద్ కాంబ్లి ఉన్నాడు. ఇక మరో రికార్డు ఏంటంటే, మయాంక్ అగర్వాల్ మొదటి ఇన్నింగ్సులో ఎనిమిది సిక్సర్లు బాదాడు. ఒక ఇన్నింగ్సులో ఎక్కువ సిక్సర్లు బాదిన భారత బ్యాట్స్ మెన్ గా నవ జ్యోత్ సిద్ధుతో కలిసి ఈ రికార్డును పంచుకుంటున్నాడు. సిద్ధు 1993 లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో ఇకే ఇన్నింగ్స్ లో ఎనిమిది సిక్సర్లు బాదాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: